తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే.. సీఎం రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు..!

*ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్*

తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే..

మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే తుది నిర్ణయం..

నేను ఎవరిని రికమండ్‌ చేయడంలేదు..

ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తాం..

అర్జెంట్‌గా అరెస్ట్‌ చేయించి జైల్లో వేయాలనే యోచన నాకు లేదు..

సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నా..

రేవంత్‌రెడ్డి..

కేబినెట్ విస్తరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కసరత్తులు మొదలుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే విస్తరణ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీ బయలుదేరగా.. ఈ రెండు, మూడు రోజులు పార్టీ పెద్దలతో వరుసగా భేటీ ఇది ఇటీవల కాలంలో వరుసగా వస్తున్న కథనాలు కానీ మీడియాతో చిట్ చాట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత సమయం పట్టేలా ఉంది అని చెప్పడంతో.. మంత్రివర్గ విస్తీర్ణంలో తమ పేరు ఉంది అని ఆశపడిన అందరి ఆశలపై నీరు చల్లినట్టే ఉందని రాజకీయ వర్గాలు వినిపిస్తున్న వాదన… ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..