పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు ..
ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి…వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ…..
టీడీపీ ఎంపీలు మమ్మల్ని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ..
60 వేల కోట్లు పోలవరానికి కావాల్సి ఉండగా…30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారు. పోలవరం పూర్తి కెపాసిటీ లేకపోతే బనకచర్లకు నీరు తరలించడం సాధ్యం కాదు. ఎంతో మంది విద్యార్థులు రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లి మెడిసిన్ చదువుతున్నారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలను ఆపేసి, సీట్లను లేకుండా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. విభజన హామీలపై వైయస్ఆర్ సీపీ ఎంపీలు పోరాడుతుంటే..టీడీపీ ఎంపీలు మమ్మల్ని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ఎంపీలతో కలిసి పోరాడేందుకైనా మేము సిద్ధం.
–
పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల సైటెర్లు..…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ.. ‘ఆడపిల్లల జోలికొస్తే తొక్కిపెట్టి నార తీస్తాం.. నడుం వంచి దెబ్బలు కొడతాం. అన్న పవన్ కళ్యాణ్.. ఏది ఇప్పుడేం అయింది’ అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు తొక్క లేదు.. నార లేదు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు….
పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం..
పార్టీ సీనియర్ నేతలతో YSRCP అధినేత, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.
తాడేపల్లి YSRCP కేంద్ర కార్యాలయంలో కొనసాగుతున్న సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ నేతలతో చర్చిస్తున్నారు.
ఈ సమావేశంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని, మజ్జి శ్రీనివాసరావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తీ ….
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు ఆయనకు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం కార్తీ సర్దార్-2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కార్తీ తన 29వ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది….
మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం..ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..
మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు.. ఈ మధ్య కాలంలో మద్యం విషయంలో వైఎస్ జగన్ ఏమీ చేశాడో అందరు చూశారని ఆయన గుర్తు చేశారు. తాము మద్యం పాలసీపై పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మంగళవారం అమరావతిలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ధరలు పెంచడానికి అనేక రకాల మద్యాన్ని తీసుకు వచ్చారని చెప్పారు.
గతంలో పనికి మాలిన చెత్త మద్యాన్ని విక్రయించారని ఆయన విమర్శించారు. తాము మాత్రం రిటైలర్ మార్జిన్ 15 శాతం ఉండాలని భావించామన్నారు. తాము ప్రతి బాటిల్‌పై రూ. 10 మాత్రమే పెంచామన్నారు. గత మద్యం అక్రమాలపై విచారణ జరుగుతోందని.. అవన్నీ బయటికి వస్తాయని భయపడుతున్నారని చెప్పారు.
ఇక కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపులు కేటాయించామని వివరించారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారని.. అందులోభాగంగా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం150 కొత్త బ్రాండ్లు తెచ్చామన్నారు. ఏ మద్యం కావాలో వారే.. ఇండెంట్ పెట్టుకొంటారని వివరించారు..
వాట్సాప్ ఫైళ్ల వేగంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ..!
ఏపీలో వాట్సాప్ గవర్నెర్స్ పై, ఫైళ్ల వేగంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులు, అధికారులు వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ- ఆఫీస్ లో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని, పలు శాఖల్లో ఈ ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతోన్న ప్రక్రియపై ఆర్టీజీఎస్ సీఈవో కే. దినేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
గవర్నమెంట్ ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సు లో వేగం పెరగాలని, ఫైళ్లు ఎక్కడికక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనే దానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఫైళ్ల విషయంలో ఆలస్యం చేయకూడదని అన్నారు. ఆలస్యం అవ్వడానికి గల కారణాలు వెంటనే తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లను త్వరితగతిన పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అందరూ సమిష్టంగా పని చేయాలని చెప్పారు. ఫైళ్లలో ఆర్థిక, ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లు ఉంటాయని.. ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లను ఎప్పటికప్పుడూ వేగవంతం చేయాలని అన్నారు. ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ఉంచకూడదని పేర్కొన్నారు. ఆర్థిక పరమైన ఫైళ్లు ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకొని ఫైళ్లను ఎప్పటికప్పుడూ సమీక్షించాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తన పొలిటికల్ రీఎంట్రీపై సంచలన ప్రకటన..!
బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తన పొలిటికల్ రీఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ కళామతల్లి సేవలోనే మరిన్ని మంచి సినిమాలు చేస్తానని చెప్పారు. అలా.. తన పొలిటికల్ రీఎంట్రీపై వస్తున్న రూమర్స్ కు ఆయన చెక్ చెప్పారు…చాలామందికి డౌట్స్ వస్తున్నాయి.. పెద్ద పెద్ద వాళ్లకు దగ్గరవుతున్నాడు.. అటు వైపు వెళ్తాడా అని… అటువంటి డౌట్ వద్దు.. నా లక్ష్యాలు, సేవాభావాన్ని సాధించడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు” అని చిరంజీవి చెప్పారు..ఈ జన్మంతా ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ అక్కున చేర్చుకుంటూ ఆ కళామ ల్లితోనే ఉంటాను. చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి అటు వెళ్తాడా, పెద్ద పెద్ద వాళ్లందరికీ దగ్గర అవుతున్నాడు. వాళ్లందరూ దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా.. అంటే కాదు.. మరో రకంగా సేవలు అందించడం కోసమే తప్ప.. అంతకుమించి పొలిటికల్ గా వెళ్లటం లేదు.
ఆ డౌట్ ఎవరూ పెట్టుకోవద్దు. పొలిటికల్ గా వద్దు. పొలిటికల్ గా ముందుకు వెళ్లడానికి, నేను అనుకున్న లక్ష్యాలను, నేను అనుకున్న సేవా భావాలను, ఆ సేవలను చేయడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు” అని చిరంజీవి సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.
చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై ఈ మధ్య కాలంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆ పార్టీలో చేరతారని ఒకసారి, ఈ పార్టీలో చేరతారని మరొకసారి ప్రచారం జరిగింది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడులకు చిరంజీవి సైతం హాజరయ్యారు..
ఏపీలోని ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త.
ఏపీలోని ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పెద్దఎత్తున చేపట్టనున్నట్లు ప్రకటించారు. మరీ ముఖ్యంగా మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తేనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు ట్వీట్ చేశారు. మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్ రంగాలలోని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు.. సైన్స్ రంగంలో వారు సాధిస్తున్న విజయాల పట్ల అభినందనలు తెలియజేశారు. స్టెమ్ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.