అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని మరచిపోయారు.. కేటీఆర్..

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2014 తర్వాత ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసిందని ఆయన గుర్తు చేశారు. పువ్వాడ అజయ్ లాంటి ఉత్సాహవంతమైన నాయకుడు ఓడిపోవడం బాధాకరమన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా ప్రజలకు కష్టం వస్తే బీఆర్ఎస్ నాయకుల గులాబీ దండు ఏడాది కాలంగా వారికి అండగా ఉందని స్పష్టం చేశారు…
ఖమ్మంలో వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చాడన్నారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎంతో కలిసి ముగ్గురు మంత్రులు ఉన్నారని.. కానీ వరదల సమయంలో వాళ్ల వల్ల ఒక్క పైసా కూడా ఉపయోగం లేదని అన్నారు..