బాయ్ ఫ్రెండ్ నంబర్ బ్లాక్ చేశాడని…పోలీస్ లకు ఫిర్యాదు..!

*బాయ్ ఫ్రెండ్ నంబర్ బ్లాక్ చేశాడని..*

*అనంతపురం:*

* బాయ్ ఫ్రెండ్ తన నంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి 100కు కాల్ చేసిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది.
* ‘అతను నాతో మాట్లాడట్లేదు. నంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి.. నా నంబర్ అన్ బ్లాక్ చేయించండి’ అని ఫోన్ రాగా.. గుత్తి పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూ కోల్ట్స్ పోలీసులు ఆమెను సంప్రదించారు.
* అయితే, తన ఇంటికి రావొద్దని నంబర్ అన్లాక్ చేయిస్తే చాలని యువతి చెప్పింది.
* దీంతో పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు..

నంబర్ అన్ బ్లాక్ చేయిస్తే చాలని రిక్వస్ట్ చేసింది. దీంతో… అతడి నెంబర్ తీసుకున్న కానిస్టేబుల్.. డైల్ చేసి చూసినా కాల్ రిసీవ్ చేయలేదని అంటున్నారు.

దీంతో.. ఆ విషయం సదరు యువతికి చెప్పిన పోలీస్… దీనిపై నేరుగా స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం మంచిదని సూచించినట్లు చెబుతున్నారు. దీంతో… ఈ విషయం ఆసక్తిగా మారింది. డయల్ 100 ను ఇలా కూడా వాడుతున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.