కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు

*• కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు*

మరోవైపు.. నిన్న తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని ఏఐసీసీ మార్చింది

కొత్త ఇంఛార్జ్ నియామకం నేపథ్యంలో రాహుల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత నెలకొంది

అంతేకాకుండా.. ఖాళీ కానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల ఎంపికపై కూడా రాహుల్ తో సీఎం చర్చిస్తున్నారు

త్వరలో సూర్యాపేట, ఏప్రిల్‌లో గద్వాల్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు

తెలంగాణలో కులగణన పూర్తి అయిన సందర్భంగా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం

సూర్యాపేట సభకు రావాలని రాహుల్ గాంధీని స్వయంగా ఆహ్వానించనున్న రేవంత్..
మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటివల పూర్తి చేసిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాలు, ఈనెల 16 నుంచి 28 ప్రత్యేక సర్వే, సర్వే పూర్తి అయ్యాక దానికి చట్టబద్దత కల్పించి దానిని కేంద్రానికి పంపించడం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, పీసీసీ కార్యవర్గం ఖరారు, నామినెటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఈ సమావేశంలో రాహుల్‌కు రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓసీల నుంచి స్థానం కల్పించాల్సి ఉంది.

ఇప్పటికే తెలంగాణ నుంచి వెళ్లిన జాబితాను చివరిసారిగా పరిశీలించి, సీఎం రేవంత్, రాహుల్ చర్చించికుని తుదిరూపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాల్టి సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించున్నదీ ఖరారయ్యే చాన్స్ ఉంది. ఇక మంత్రివర్గంలో చోటును ఆశించినా దక్కని నిరాశావహులకు రాష్ట్రంలో కీలకమైన కార్పొరేషన్లు, చైర్ పర్సన్లుగా నియమించడం, పీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో బాధ్యతలు అప్పజెప్పేలా ఏఐసీసీ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. అంటూ ప్రచారం జరుగుతోంది.