*
సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న ఆయన హస్తం పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్, బీఆర్ఎస్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని వ్యాఖ్యానించారు.
దీంతో కోనప్ప గులాబీ పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి..