లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ వాయిదా!

తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ వాయిదా!
తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1న లక్ష తెల్ల రేషన్కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా పలు జిల్లాల్లో కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొందరికి కార్డులు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.

భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన కార్లు..

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆకస్మిక వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కులూ జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైందని రాష్ట్ర వాతావరణ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యవస్థమైంది. మరీ ముఖ్యంగా, కొండ ప్రాంతాల్లో జనాలు చిక్కుకుపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం విద్యుత్తు, తాగునీరు ఇతర సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి..

పోలీసులు నాకు బేడీలు వేశారు: నటుడు సునీల్ శెట్టి

పోలీసులు నాకు బేడీలు వేశారు: నటుడు సునీల్ శెట్టి
నటుడు సునీల్‌ శెట్టికి ఎదురైన ఓ చేదు అనుభవం గురించి తాజాగా తెలిపాడు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి జరిగినప్పుడు మేం ‘కాంటే’ షూట్‌ కోసం లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లాం. అక్కడి వారు నా గెటప్ చూసి పరుగులు తీశాడు. ఇంతలో పోలీసులు నేను దుండగుడినని భావించి ‘నాకు తుపాకీ గురి పెట్టి.. చేతులకు బేడీలు వేశారు. హోటల్‌ మేనేజర్‌ నేను నటుడినని పోలీసులకు చెప్పడంతో విడిచిపెట్టారు’ అని సునీల్‌ శెట్టి తెలిపాడు.

దక్షిణ భారత్‌పై కుట్ర జరుగుతోంది: కేఏ పాల్

దక్షిణ భారత్‌పై కుట్ర జరుగుతోంది: కేఏ పాల్
దక్షిణ భారత్‌పై కుట్ర జరుగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. 2027లో దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, డీలిమిటేషన్‌ను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఉత్తర భారత్‌లో ఎంపీ స్థానాలు పెంచి.. దక్షిణ భారత్‌లో తగ్గిస్తున్నారని ఆరోపించారు. దేశంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలు లేకుండా చేయాలని కేంద్రం
చూస్తోందని పాల్ మండిపడ్డారు.

పర్యాటకరంగలో ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక దృష్టి : మంత్రి

పర్యాటకరంగలో ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక దృష్టి : మంత్రి
ఆంధ్రప్రదేశ్ : బడ్జెట్లో పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ. 469 కోట్లు కేటాయించినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ర్యాటక రంగం చోదక యంత్రంగా మారనుందని ఆయన అన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ‘పర్యాటకుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. పర్యాటక ప్రాంతాల్లో మౌలికవసతుల మెరుగుదలపై దృష్టి పెట్టాం. అఖండగోదావరి, గండికోటకు నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని మంత్రి తెలిపారు…

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు: టీటీడీ చైర్మన్.

ఆంధ్రప్రదేశ్ : TTDలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని TTD చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. TTD ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్, స్పోర్ట్స్ లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారుకావాలని కోరారు. TTD ఉద్యోగులకు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించడం కోసం ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. దీంతో వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు…

కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త!.

ఆంధ్రప్రదేశ్ : కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా అందిస్తామని తెలిపింది. ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి.. ప్రతీ రైతుకీ రూ.20,000 చొప్పున ఇస్తామన్నారు. అలాగే భూమి లేని కౌలు రైతులకు కూడా రూ.20,000 చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. ఈ డబ్బును ఎన్ని విడతల్లో ఇస్తారనేది చెప్పలేదు..

కర్ణాటక బీజేపీ.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే కానున్నారా…!

కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్.. శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే..ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలపడింది.

అయితే తాజాగా కర్ణాటక బీజేపీ.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే కానున్నారంటూ వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్ లో మరింత అలజడి రేపింది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్ నాథ్ షిండే సహకరించిన విషయాన్ని ఆర్ అశోక ప్రస్తావించారు. అదే బాటలో డీకే శివకుమార్ కూడా నడిచి కాంగ్రెస్ ను చీల్చుతారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బలమైన నేతగా ఉన్న డీకే.. ఆ పార్టీని కూల్చడం జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై డీకే శివకుమార్ స్పందించారు.. ఇది బీజేపీ గేమ్ ప్లాన్ అంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ వాదినని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడనని స్పష్టం చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని డీకే పేర్కొన్నారు…

అఫ్గానిస్థాన్.. జట్టు ఆశలపై నీళ్లు.. వర్షంతో మ్యాచ్ రద్దు.. సెమీస్ లో ఆసీస్.

రెండు జట్లూ చెరో పాయింట్ పంచుకున్నాయి. గ్రూప్-బిలో 4 పాయింట్లతో ఆసీస్ సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. ఇంగ్లండ్ పై కంగారూ జట్టు గెలిచింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ వర్షంతో రద్దయింది.

వరుణుడి దెబ్బ

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్ పై ఆసీస్ ఛేజింగ్ లో వరుణుడు ఆటకు అడ్డుపడ్డాడు. ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో 109/1తో ఉండగా వర్షం వల్ల ఆట నిలిచిపోయింది. ఆ సమయానికి ట్రేవిస్ హెడ్ (59 నాటౌట్), స్టీవ్ స్మిత్ (19 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ మాథ్యూ షార్ట్ (20)ను అజ్మతుల్లా ఔట్ చేశాడు. అప్పటికీ ఆసీస్ విజయానికి 37.1 ఓవర్లలో 165 పరుగులు కావాలి.

అఫ్గాన్ పోరాటం

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్ పోరాడింది. 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదికుల్లా అటల్ (85), అజ్మతుల్లా ఒమర్ జాయ్ (67) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షియస్ మూడు.. స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు.

గంట గడిచినా

భారీ వర్షంతో గడాఫీ స్టేడియం చెరువులా మారింది. మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పలేకపోయారు. వర్షం ఆగి ఒక గంట గడిచినా ఆటకు మైదానం సిద్ధం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒకటే సూపర్ సోపర్ మాత్రమే అక్కడ పనిచేసింది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో పాకిస్థాన్ కాలమానం ప్రకారం రాత్రి 8.45 గంటలకు పరీక్షించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. దీంతో అఫ్గాన్ ఆటగాళ్లు తీవ్రమైన నిరాశతో స్టేడియం వీడారు.

టోర్నీ నుంచి ఔట్!

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ ఆశలు దాదాపుగా కూలినట్లే. ఆ జట్టు సెమీస్ చేరాలంటే శనివారం (మార్చి 1) దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ భారీ తేడాతో గెలవాలి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 300 చేసిందంటే.. పరుగుల పరంగా ఇంగ్లండ్ 207 పరుగుల తేడాతో, ఛేదనలో అయితే 11.1 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇక సౌతాఫ్రికా గెలిస్తే నేరుగా నాకౌట్ చేరుతుంది. ఎలా చూసుకున్నా ఈ టోర్నీలో అఫ్గాన్ పోరాటం ముగిసిందనే చెప్పాలి. ఈ టోర్నీలో వర్షంతో రద్దయిన మూడో మ్యాచ్ ఇది..

ఖమ్మం జిల్లాలో దారుణం

మద్యం మత్తులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దుంప వేంకటేశ్వర రావు అనే వ్యక్తి, రోడ్డుపై ఆడుకుంటున్న ఒక చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు

ఆ చిన్నారి కేకలు వేయ్యటంతో పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు..