న్యాయవ్యవస్థ పై అవగాహన అవసరం విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగ అవసరం.

న్యాయవ్యవస్థ పై అవగాహన అవసరం మరియు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగ అవసరం.

కొణిజర్ల: బాలికలు న్యాయవ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని తద్వారా హక్కులు పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే చంద్రశేఖర రావు తెలిపారు. తెలంగాణా గురుకుల సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఆకాంక్ష ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన బాలికల సంరక్షణకు సెక్షన్ల ను వివరించారు. ఆయా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తద్వారా అవసరమైన సమయంలో మేలు జరుగుతుందని తెలిపారు. మరియు పరీక్షల సమయంలో విద్యార్థినులకు మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కొరకు యోగ,ప్రాణాయామం గురించి మరియు విద్యార్థినులు, మహిళల ఆరోగ్యం కొరకు ఆయుర్వేద గృహ చికిత్సల గురించి ప్రముఖ యోగ గురువు షేక్ బహర్ అలీ ఖమ్మం వారు అవగాహన కల్పించినారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రజిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ ఏ నవ్య, అధ్యాపకులు కె పి ఐశ్వర్య.కె,రజిని, కె రజిత,తో పాటు ఎన్ శ్రీనివాస్ శర్మ, సిహెచ్ హైమావతి,ప్రతిభా రెడ్డి,నాగమణి, లలిత, వంగూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.