*బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరికొందరు సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు*.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలతో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా 25 మంది సెలబ్రెటీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మియాపూర్ పోలీసులు.
అమరావతి: చిరంజీవిపై పవన్ ఆసక్తికర ట్వీట్.
నా జీవితానికి హీరో చిరంజీవి-పవన్‌కల్యాణ్
నేను చిరంజీవిని తండ్రిలా భావిస్తా
నేను ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు..
నా జీవితానికి మార్గం చూపించిన వ్యక్తి చిరంజీవి
యూకే జీవిత సాఫల్య పురస్కారంతో..
చిరంజీవి కీర్తి మరింత పెరిగింది-పవన్‌కల్యాణ్.
ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ కెప్టెన్‌గా సూర్య
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్(2025) సీజన్ 18 మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే, మార్చి 23న చెన్నైతో జరిగే మ్యాచ్‌కి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్య వెల్లడించాడు. గత ఎడిషన్‌లో పాండ్య స్లో ఓవరేట్‌కు గురయ్యాడు. దీంతో అతడిపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో చెన్నైతో జరిగే మ్యాచ్‌కి అతడు అందుబాటులో ఉండడు..
IPL 2025: చరిత్రలో తొలిసారి ఇలా!
ఐపీఎల్ మహా సంగ్రామం మార్చి 22న ప్రారంభం కానుంది. అయితే, ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఈ ప్రారంభోత్సవ వేడుకలను మ్యాచ్‌లు జరిగే అన్ని వేదికల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్ వేదికలైన కోల్‌కతా, హైదరాబాద్ , విశాఖపట్నం, చెన్నై, గౌహతి, అహ్మదాబాద్, లక్నో, ముంబై, చండీగఢ్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, ధర్మశాల.. మొత్తం 13 స్టేడియాల్లో ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి..
నేడు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై తుది విచారణ జరగనుంది.
ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించనుంది.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు వంశీకి బెయిల్ మంజూరు చేయొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
*బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కొనసాగుతున్న దర్యాప్తు – బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 11 మందికి పోలీసుల నోటీసులు*
బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావడానికి కొందరు యూట్యూబర్లు సమయం కోరారు. ఇకపై యాప్స్‌కు ప్రచారం చేయబోమని మరికొందరు పోస్టులు పెట్టారు. మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసుల విచారణకు హాజరైన నటి విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ వ్యవహారంలో పోలీసుల విచారణకు నటి విష్ణుప్రియ పంజాగుట్ట పీఎస్‌లో హాజరయ్యారు. కాగా విచారణకు హాజరు కావాలని ఆమెకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు..
103 సార్లు పాములు కాటు వేసినా బతికి బట్ట కడుతున్న వ్యక్తి
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాములు పగబట్టి కాటేస్తున్నాయా లేదంటే ప్రమాదవశాత్తు పాములుకాటుకు గురి అవుతున్నాడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది
బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు
ఇలా వింత సమస్యతో సతమతం అవుతున్నాడు. పాము కాటుకు గురై మృత్యుంజయుడిగా మారాడు. వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నా.. సుబ్రమణ్యం ఇప్పటివరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు.. అవును అన్ని సార్లు కూడా పాము కాటుకు గురై.. ఆసుపత్రి పాలై చికిత్స పొందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు
18 ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసము ఉంటూ తొలిసారి పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం.. అయితే ఏ సర్ప దోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలి పోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు..
ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్.. 14 వేల మంది తొలగింపునకు రంగం సిద్ధం!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. మొత్తం 14 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. సంస్థ తాజా నిర్ణయంతో ఏడాదికి రూ. 210 కోట్ల నుంచి రూ. 360 కోట్ల వరకు ఆదా అవుతాయని భావిస్తోంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
తొలగింపులన్నీ మేనేజర్ స్థాయిలోనే ఉంటాయని సమాచారం. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెజాన్ ఇటీవల కమ్యూనికేషన్స్, సస్టెయిన్‌బిలిటీ విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరో 14 వేల మందిపై వేటుకు రంగం సిద్ధం చేసింది. 2022, 2023 సంవత్సరాల్లో అమెజాన్ ఏకంగా 27 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది..
బాలకృష్ణ పాటపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్
తెలుగు సినిమా ఇండ్రస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ మహిళా కమిషన్
తెలుగు సినిమా పాటల్లో మహిళలతో అసభ్యకరంగా డాన్స్ చేస్తూ చూపించారని వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన చైర్పర్సన్ నేరెళ్ళ శారద నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్
అటువంటి కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని నిర్మాతలు మరియు కొరియోగ్రాఫర్లను హెచ్చరించిన మహిళా కమిషన్
ఇలానే కొనసాగిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన చైర్పర్సన్ నేరెళ్ల శారద….
ధర్మపురి అరవింద్ బోడి గుండుపై జోకులు వేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు
8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే తెలంగాణకు కిషన్ రెడ్డికి జుట్టు ఉన్నంత నిధులు వస్తాయని అనుకుంటే, కనీసం బండి సంజయ్‌కి ఉన్న జుట్టంత కూడా రాలేదు
చివరికి ధర్మపురి అరవింద్‌కు ఉన్న జుట్టంత నిధులు వచ్చాయి అంటే తెలంగాణకు బోడి గుండు వచ్చింది….
గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు
నిజామాబాద్ జిల్లాలోని గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారు
బుధవారం ఉదయం హాస్టల్లో పప్పు అన్నం తిన్న విద్యార్దులు, ఉదయం 11 గంటలకు వాంతులు చేసుకున్నారు, వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో గురుకులాల పిల్లలను అద్భుతంగా చూసుకుంటున్నాము అని చెప్పిన మాటలు అన్నీ ఉత్తి మాటలే అని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని విద్యార్థుల తల్లితండ్రులు విమర్శిస్తున్నారు…