లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

ఢిల్లీ*

*🔹ఎంపీలకు పెరిగిన జీతాలు. ఎంపీలకు జీతాలతో పాటు అలవెన్స్, పెన్షన్ పెంపు,.*

మాజీ ఎంపీలకు అడిషనల్ అలవెన్స్ కూడా పెంచిన కేంద్రం.

ఎంపీ జీతం రూ.లక్ష నుంచి రూ.లక్షా 24 వేలకు పెంపు. ఎంపీల రోజువారీ రూ.2 వేల అలవెన్స్ రూ.2,500కు పెంపు.

మాజీ ఎంపీల పెన్షన్ రూ.25 వేల నుంచి రూ.31 వేలకు పెంపు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత

MMTS రైలు ఘటనపై MLC కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. మహిళా భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని సూచిస్తున్నా’ అని తెలిపారు..

రాష్ట్రంలో అందాల పోటీలు కాదు. మహిళలకు భద్రత కల్పించాలి..brs పార్టీ నాయకులు..

హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై గాంధీ ఆసుపత్రి అధికారులను కలిసి, బాధితురాలిని పరామర్శించిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు

రాష్ట్రంలో అందాల పోటీలు కాదు. మహిళలకు భద్రత కల్పించాలి

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు.. బస్సులో , ట్రైన్‌లో కూడా మహిళలకు భద్రత కరువైంది

మహిళలపై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22 శాతం పెరిగాయి.. మహిళల భద్రతపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ని ఆదేశించారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల్లో పురోగతిని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యులు ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు.

నిపుణుల కమిటీ సూచనలను తీసుకుంటూ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

*ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ ..

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరైన అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ మూల్యాంకన విధుల్లో ప్రతి సెంటర్ లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు బిఐఈ యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వేలిముద్రలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈ యాప్ లో హాజరు చేసుకోవచ్చు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత మరో 10 రోజుల్లో మార్కులను ఎంటర్ చేసే ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

హింసకు కారణమైన కీలక నిందితుడు ఫహీమ్‌ఖాన్ బుల్డోజర్‌ ఆపరేషన్‌..

నాగ్‌పుర్‌లో ఇటీవల చెలరేగిన హింసకు కారణమైన కీలక నిందితుడు ఫహీమ్‌ఖాన్‌కు (Fahim Khan) చెందిన అక్రమ నిర్మాణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్‌ ఆపరేషన్‌ (Bulldozers action) చేపట్టింది..సోమవారం ఉదయం అతడి నివాసం, ఇతర నిర్మాణాలను నాగ్‌పుర్‌ మున్సిపల్‌శాఖ అధికారులు కూల్చివేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్ల వీటిని కూల్చివేశామన్నారు. కాగా మైనారిటీ డెమోక్రటిక్‌ పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఫరీమ్‌ సామాజిక మాధ్యమం ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ఘర్షణలకు కారణమయ్యాడన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.మార్చి 17న నాగ్‌పుర్‌ (Nagpur)లో కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మతపరమైన వస్తువులు దహనం చేసినట్లు కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు వదంతులు వ్యాప్తి చేయడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికి కారణమైన ఫరీమ్‌తో సహా ఆరుగురిపై దేశద్రోహం కేసును నమోదు చేశారు. 50 మంది నిందితులపై సైబర్‌ విభాగం నమోదు చేసిన నాలుగు ఎఫ్‌ఐఆర్‌లలో వీరి పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు 200 మంది నిందితులను గుర్తించామని, మరో వెయ్యి మందిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో ఉన్నామని ఓ సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు.

మహారాష్ట్రలో ఉన్న మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో శంభాజీనగర్‌లోని 18వ శతాబ్దానికి చెందిన ఆయన స్మారకానికి ఇరువైపుల భారత పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) ఇనుప రేకులను, కంచెను ఏర్పాటుచేసింది..

తిరుమలలో అక్రమంగా నివసిస్తున్న వారి పై కొరడా.

తిరుమలలో అనధికారికంగా నివసిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. రెండు రోజుల క్రితం తిరుమలలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే..గత నెలలో తిరుమల లోని ఓ హోటల్ లో పని చేస్తున్న యువకుల మధ్య గొడవ కత్తిపోట్లు దారితీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనధికారికంగా, సరైన పత్రాలు లేకుండా తిరుమలలో ఉంటున్న వారిని గుర్తించి, వారిని వాహనాల్లో తిరుపతికి తరలించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.

*🔹రేపు తెలంగాణలో పొడి వాతావరణం*

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి..

తెలంగాణలో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

రేపు ఆదిలాబాద్‌లో గరిష్టంగా 38.3 డిగ్రీలు..

హైదరాబాద్‌లో 33.8 డిగ్రీలు నమోదయ్యే చాన్స్..

*ATM ఛార్జీల పెంపు.. మే 1 నుంచి..*

ATM ఇంటర్చేంజ్ ఫీజుల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ .2, ఆర్థికేతర లావాదేవీలకు రూ .1 ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ ఛార్జీల పెంపు పరిమిత ATM నెట్వర్క్ ఉన్న చిన్న బ్యాంకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.