నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 29 – 03 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
బహుళ పక్షం,

తిథి : *అమావాస్య* సా5.02 వరకు,
నక్షత్రం : *ఉత్తరాభాద్ర* రా8.18 వరకు,
యోగం : *బ్రహ్మం* రా11.08 వరకు,
కరణం : *చతుష్పాత్* ఉ6.06 వరకు
తదుపరి *నాగవం* సా6.02 వరకు,
ఆ తదుపరి *కింస్తుఘ్నం* తె3.54 వరకు,

వర్జ్యం : *ఉ6.45 – 8.15,*
దుర్ముహూర్తము : *ఉ6.01 – 7.37,*
అమృతకాలం : *మ3.47 – 5.17,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.01,
సూర్యాస్తమయం: 6.08,

*_నేటి విశేషం_*

`కొత్త అమావాస్య` అనగానే దీని ప్రత్యేకతపై అందరూ దృష్టి పెడతారు.
ఈ రోజున ఏం చేయాలనే విషయాన్ని గురించి , ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని గురించి సందేహాలను వ్యక్తం చేస్తుంటారు.
సరైన సమాధానం లభించక సతమతమైపోతుంటారు, అయితే శాస్త్రాన్ని అనుసరించి నడచుకునే వాళ్లకి దీని గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది.

*’ఫాల్గుణ బహుళ అమావాస్య’ని* కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు.
ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య.
దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది.

ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలి ? ఎలాంటి కార్యక్రమాలని నిర్వహించాలనే విషయంలో తర్జనభర్జనలు పడుతుంటారు.

ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.

సాధారణంగా ప్రతి నెలలోను అమావాస్య రోజున పితృదేవతలకు పిండప్రదానం చేయడం , తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు.
అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది.
ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమగతులు లభిస్తాయని చెప్పబడుతోంది.

*ఫాల్గున అమావాస్య, యుగాది అమావాస్య*

ఈ అమావాస్య నాడు విప్రులకు భోజనము పెట్టినా పితృదేవతలను తలచుకొని వారి ప్రీతికై స్వయంపాకాదులు దానం చేసినా వంశాభివృద్ధి జరుగుతుంది.
ఈ పని పసివారి నుండి ముసలివారి వరకూ అందరూ చేయవచ్చును.
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.

అమావాస్య నాడు రాహుకాలం సమయంలో శివలింగదర్శనం, శివాభిషేకం అత్యంత శుభప్రదం, ఆరోగ్యదాయకం.
శివపంచాక్షరీ స్తోత్రం శ్రవణం చేయడం, పారాయణం చేయడం సకలపుణ్యప్రదం.

*_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏