ముంబయి ఇండియన్స్‌కి రెండో ఓటమి…!

ఐపీఎల్‌లో శనివారం గుజరాత్‌తో టైటాన్స్‌ జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండిమన్స్‌ 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టు చాలా తప్పులు చేసిందని.. వసరమైన ప్రదర్శన చేయలేదని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్‌ బ్యాట్స్‌మెన్‌ను హెచ్చరించాడు. రోహిత్‌ శర్మ, నమన్‌ ధీర్‌, ర్యాన్‌ రికెల్టన్‌ వంటి బ్యాట్స్‌మెన్స్‌ విఫలమైన విషయం తెలిసిందే. టైటాన్స్‌ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి ఆరు వికెట్ల 160 పరుగులు మాత్రమే చేయగలిగింది..

ముంబయి ఇండియన్స్‌కి ఇది రెండో ఓటమి. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభం అందించారు. 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో సాయి సుదర్శన్‌ 63 పరుగులు చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ (38), జోస్‌ బట్లర్‌ (39), రూథర్‌ఫోర్డ్ (18) రాణించారు. గుజరాత్‌ బౌలర్లు సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణకు చెరో రెండు, రబాడా, సాయి కిశోర్‌కు చెరో వికెట్‌ దక్కింది.