నేటి పంచాంగం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 01 – 04 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,

తిథి : *తదియ* ఉ9.54 వరకు,
నక్షత్రం : *భరణి* మ3.24 వరకు,
యోగం : *విష్కంభం* మ1.53 వరకు,
కరణం : *గరజి* ఉ9.54 వరకు
తదుపరి *వణిజ* రా8.43 వరకు,

వర్జ్యం : *రా2.37 – 4.07,*
దుర్ముహూర్తము : *ఉ8.24 – 9.13,*
మరల *రా10.52 – 11.39,*
అమృతకాలం : *ఉ10.55 – 12.25,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.00,
సూర్యాస్తమయం: 6.09,

*_నేటి విశేషం_*
*సౌభాగ్య గౌరీ వ్రతం*
*శివ డోలోత్సవము*
శివడోలోత్సవము చైత్ర శుద్ధ తృతీయ రోజు జరుపుకొనే పండుగ.
వసంత నవరాత్రులు తొమ్మిది రోజులలో ఇది మూడోరోజు. మన పంచాంగకర్తలు దీనినే సౌభాగ్యగౌరీ వ్రతం, సౌభాగ్యశయన వ్రతం, మాసగౌరీ వ్రతం, ఉత్తమ మన్వాది అని కూడా పేర్కొన్నారు.

శివడోలోత్సవమునాడు ఉమా శివులను దమనముతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.
దీనిని ఆందోలన వ్రతమంటారు, ఈ వ్రతానికి విదియతో కూడిన తదియ పనికిరాదని, చవితితో కూడిన తృతీయ ముహూర్త మాత్రం ఉన్నా గ్రాహ్యమని స్మృతి కౌస్తుభం.
ఈ డోలోత్సవ పర్వం హిందూదేశంలో పలుప్రాంతాల్లో పలురీతుల ఆచరింపబడుతూ ఉంది.
ఆ ఆచరణ ఆయా ప్రాంతాల్లో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
అంతేగాక ఇది ప్రత్యేకం స్త్రీ దేవతపేర సౌభాగ్య గౌరీవ్రతం మున్నగు నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది.
ఈ పర్వం గౌరీ నామంతో చెలామణీ కావడానికి కారణం ఉంది.
దాక్షాయణి అగ్నికి ఆహుతి అయిన పిదప హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది.
పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది.

పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది.
ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది, ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది.

అందుచేత ఆనాడు గౌరి పేరున జరిగే ఒక పర్వమైంది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది.
సౌభాగ్యాన్ని, పుత్రపౌత్రాదులను, భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు.

*హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ*

*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏