అయోధ్యలో ఆదివారం ఆదిపురుషుడికి ఆదిత్య అలంకారం…

*అయోధ్యలో ఆదివారం ఆదిపురుషుడికి ఆదిత్య అలంకారం*

అయోధ్య :

లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు రాముడికి తిలకమై మెరవనున్నాడు. అయోధ్యలో ఈ అద్భుతం రేపు మధ్యాహ్నం గం.12కు కనువిందు చేయనుంది. గతేడాది శ్రీరామనవమికి తొలిసారి ఆదిత్యుడు బాలరాముడిని తాకాడు. ఏటా నవమికి బాలరాముడి నుదుటి పైకి భానుకిరణాలు ప్రసరించేలా ఆలయం నిర్మించారు. కాంతి గుడి శిఖరాన్ని తాకే మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహాన్ని చేరేలా కుంభాకార, పుటాకార కటకాలు శిల్పులు అమర్చారు.