ఓ గుంట నక్క నన్ను ఒక బొచ్చుకుక్క అంటూ విమర్శిస్తుండు…అవును నేను కుక్కనే….కడియం శ్రీహరి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి…..

*జనగామ జిల్లా:-*

ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం…. హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

*ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ……*

బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ గుంట నక్క నన్ను ఒక బొచ్చుకుక్క అంటూ విమర్శిస్తుండు… అవును నేను కుక్కనే….

నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన ప్రజలను, నాయకులను కాపాడుకోడానికి కాపలా కుక్కలా పని చేస్తా….

అలవిగాని హామీలను ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడంలో రేసు కుక్కలా ఉంటా…..

అవును నేను కుక్కనే నన్ను నమ్మిన కేసీఆర్ కు విశ్వాసమైనా కుక్కలా ఉంటా..

కానీ ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం మరో పార్టీలోకి దుంకే నీలాంటి గుంటనక్కను మాత్రం కాను.. పార్టీ కోసం కెసిఆర్ మాట ప్రకారం నేను ప్రతి అడుగు వేస్తుంటాను.. కార్యకర్తలకి కాపలా కుక్కలానే ఉంటాను.. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కాపాడుకునేందుకు నేను అనుక్షణం వారి వెంటే ఉంటూ ఉంటాను… నీల గుంట నక్కల పార్టీలు మారి నీతులు వల్లించడం నాకు చేతకాదు అంటూ కడియం శ్రీహరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు..