నేటి పంచాంగం.. నేటి మాట…

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిగ్నమస్తు,

తేదీ … 11 – 04 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,

తిథి : *చతుర్దశి* రా2.32 వరకు,
నక్షత్రం : *ఉత్తర* మ2.53 వరకు,
యోగం : *ధృవం* రా7.32 వరకు,
కరణం : *గరజి* మ1.46 వరకు,
తదుపరి *వణిజ* రా2.32 వరకు,

వర్జ్యం : *రా12.05 – 1.50,*
దుర్ముహూర్తము : *ఉ8.18 – 9.07,*
మరల *మ12.24 – 1.14,*
అమృతకాలం : *ఉ7.06 – 8.50,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.51,
సూర్యాస్తమయం: 6.10,

*_నేటి మాట_*

*ఆత్మ జ్ఞానం*
సంపద మీద వ్యామోహం ఆధ్యాత్మిక సాధనకు ఓ పెద్ద ఆటంకం…. దీనికి తోడు అజ్ఞానం మరింతగా ఆటంక పరుస్తూ వస్తుంది.

మానవుడు తన ఇంటి నిండుగా ధనం నింపుకోవడానికి పడే తపన, ఆరాటం, ఆసక్తి, తన  ఒంటి నిండుగా గుణం నింపుకోవడంలో చూపడం లేదు.
జేబు నిండుగా డబ్బు ఉన్నప్పటికీ, పక్కవాడి ఆకలి తీర్చడానికి పైసా కూడా ఇవ్వడు…. ఇంకనూ మెుక్కులు పేరిట హుండీలలో వేలాది రూపాయలు వేస్తాడు…కానీ గుడి బయట ఉన్న దీనులకు పైసా కూడా విదల్చదు

భగవంతుడు ఎవరినైనా ధనవంతులుగా చేసారంటే…. వారు దీనులను ఆదుకుంటారని, తద్వారా వారికి సద్గతి కలిగించాలనియే!. దీనికి ఏకైక మార్గం త్యాగమే

త్యాగ నిరతి లేకుండా ఆత్మజ్ఞానం పొందాలంటే అది అసాధ్యం…
అందుకే… మానవుడు భగవంతునిపై భక్తి విశ్వాసంతో ఉంటూ… దీనులను  ఆదుకునే సద్బుద్ధి కలిగి ఉండటమే నిజమైన జ్ఞానం

*_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏