పూర్తిగా కాలి బూడిద అయిన పత్తి లారీ…

సూర్యాపేట జిల్లా… నేరేడుచర్ల మండలం చిల్లపల్లి,, సోమవారం దగ్గర కాలి బూడిదైనా లారీ.
కరీంనగర్ నుంచి చెన్నైకు పత్తిలోడుతో వెళ్తున్న లారీ..
లారీపై పిడుగు పడి పూర్తిగా కాలి బూడిద అయిన లారీ..
ఎవరికి ఏమి కాకపోవడం తో ఊపిరి పీల్చుకున్న స్థానికులు..
వెంటనే స్థానిక పోలీసులు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా వెంటనే ఫైర్,,
సిబ్బంది వచ్చి మంటల ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే కాళీ బూడిదైనా లారీ…….
పత్తి లోడుతో వెళ్తున్న లారీ పత్తితో సహా పూర్తిగా దగ్ధమైన సంఘటన..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని చింతలపల్లిలోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు నుండి సుమారు 40 లక్షల విలువ గల 24 టన్నుల పత్తిని లోడు చేసుకుంది. అనంతరం తమిళనాడు రాష్ట్రంలోని కోవైపట్టిలోని మహావిష్ణు స్పిన్నింగ్ మిల్లుకు లారీలు తీసుకువెళ్తుంది. ఈ క్రమంలోనే రాత్రి 11-30 గంటల సమయంలో చిల్లేపల్లి వచ్చేసరికి లారీ పై ఉన్న పత్తికి మంటలు వ్యాపించి ఉన్నాయని అన్నారు. ఆ మంటలు ఎలా వ్యాపించాయో తనకు తెలియదని రోడ్డు మీద వెళ్తున్న వారు చూసి తనకు చెప్పారని లారీ పక్క ఆపి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించామని వెంటనే స్థానికులు గుర్తించి పోలీసులకు ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. మిర్యాలగూడ ఫైర్ స్టేషన్ అధికారులు వచ్చేసరికి మంటలు బాగా వ్యాపించాయని ఫైర్ స్టేషన్ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన అప్పటికే బాగా మంటలు వ్యాపించడం వలన పత్తితో పాటు లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది అని తెలిపారు.