భారత పర్యటనకు వచ్చారు. దిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో దిగిన వాన్స్‌కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలకారు. భారత దళాలు వాన్స్‌కు గౌరవ వందనం చేశాయి. అనంతరం పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఆ తర్వాత దిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం చేనేత ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి ఈ నెల 24 వరకు JD వాన్స్ దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు..
సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ..
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. జేడీవాన్స్ పిల్లలు సంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనువిందు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వాన్స్ చేరుకుంటారు. చర్చల తర్వాత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. మరోవైపు వాన్స్ పర్యటన నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు..