‘భారతీయుల గొంతు కోస్తా’.. పాక్ అధికారి వార్నింగ్ ….
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట భారతీయులు ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్న పాక్ ఆర్మీ అధికారి తైమూర్ రహత్ ఇండియన్స్‌ను మరింత రెచ్చగొట్టారు. ‘మీ గొంతు కోస్తా’ అని సంజ్ఞలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఓ అధికారి ఇలా బహిరంగంగా రెచ్చిపోవడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
. అయితే లండన్ పాకిస్తాన్ హై కమిషన్ ఎదుట భారతీయులు చేస్తున్న ఈ నిరసన సమయంలో పాక్ ఆర్మీ అధికారి తైముర్ రహమత్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. మీ గొంతు కోస్తా అంటూ సంజ్ఞలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఓ అధికారిలా బహిరంగంగా రెచ్చిపోవడమేంటి అని భారతీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అవునులే టెర్రరిజం అనేది పాకిస్తాన్ డీఎన్ఏలోనే ఉందని ఫైర్ అవుతున్నారు…ఇదిలా ఉండగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ బుట్లో కూడా తీవ్రస్థాయిలో రెచ్చగొట్టు వాక్యాలకు దిగాడు. పహల్గాం దుర్ఘటనకు పాకిస్తాన్‌ను దోషిని చేయడం తప్పు అని వారి నిస్సాయహతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా నిందిస్తున్నారు అంటూ భారత్‌పై మండిపడ్డారు. అకారణంగా సింధు నది జలాలను నిలిపివేశారు. సింధునది పాకిస్తాన్ కి చెందింది. అందులో ఎలాంటి మార్పు ఉండదని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఒకవేళ ఆ సింధు నది నీళ్లు ఆపితే వారి నెత్తురు పారుతుందని భారత్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానాలు చేశారు. ఇక భారత్ యుద్ధ సన్నద్ధత గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ పాకిస్తాన్ టీవీ ఛానల్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాద్‌కు చెందిన 25 మంది కలిసి కాశ్మీర్ అత్యాధునిక ఆయుధ సాంకేతికత పై భారత్ తో పని చేస్తోందని విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతోంది. ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా క్రియాశీలం చేసిందంటూ ప్రసారం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. .