నేటి పంచాంగం… నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 01 – 05 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం ),
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
శుక్ల పక్షం,
 
తిథి : చవితి *సా4.24 వరకు*,
నక్షత్రం : మృగశిర *రా7.16 వరకు,*
యోగం : అతిగండ *మ1.10 వరకు*,
కరణం : భద్ర *సా4.24 వరకు,*
తదుపరిబవ *తె3.34 వరకు,*

వర్జ్యం : *తె3.21 – 4.54,*
దుర్ముహూర్తము : *ఉ9.51 – 10.41.*,
*మరల మ2.53 – 3.43,*
అమృతకాలం : *ఉ10.54 – 12.25,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 5.39,
సూర్యాస్తమయం: 6.14,

*_నేటి మాట_*

*దైవానుగ్రహం*
“దేవుడు నీ కష్టాలు తీర్చడం లేదని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు గానీ, అసలు ఆ కష్టాలను తొలగించే అనుగ్రహం పొందేందుకు నీలో అర్హత ఉందా లేదా అని ముందు ఆలోచించుకోవాలి”…

మనిషి జీవితాంతం డబ్బు లేదని ఏడుస్తూ ఉంటాడు, భార్య పిల్లల కోసం ఏడుస్తాడు, భూములు, సంపదలు, ఆనారోగ్య సమస్యలు ఒకటేమిటి తాను ఏడ్వనిదంటూ ఏది ఉండదు.

కానీ ఎప్పుడైనా భగవంతుని కోసం కన్నీరు కార్చావా!!
తన్మయత్వంతో నామ స్మరణ చేస్తూ ఎప్పుడైనా ఆనంద బాష్పాలు కార్చావా??!
ధీనులు , దుఃఖితులు, రోగులు మున్నగువారి దీనస్థితి చూసి ఎప్పుడైనా చింతించావా?!
వారికి ఎలాంటి సహాయాన్నైనా అందించావా??!
వీటిలో ఏదీ చేయకుండా దైవానుగ్రహం కావాలంటే కుదరదు…
అయితే వీటిలో ఏ ఒక్కటి చేసినా కూడా నువ్వు దైవానుగ్రహానికి అర్హుడవే!!

“నువ్వెక్కడకీ పోకు.. దైవానుగ్రహమే నిన్ను వెదుక్కుంటూ వస్తుంది.”

*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏