భారత్ చేసిన మెరుపు దాడికి పాకిస్థాన్లో ప్రజలు నినాదాలు…!..పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్…!
భారత్ చేసిన మెరుపు దాడికి పాకిస్థాన్లో ప్రజలు అల్లాడుతున్నారు. రోడ్లపైకి వచ్చి… భారత్తో యుద్ధం వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో అప్రమత్తైమన ఆర్మీ అధికారులు రాజకీయ నాయకులు తమ కుటుంబాలను దేశాన్ని దాటిస్తున్నట్టు తెలుస్తుంది. పాక్లోని ఏటీఎంల దగ్గర జనాలు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో పాకిస్థాన్లో ఒక్కసారిగా అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి…
ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. చెప్పి మరీ ఎటాక్ చేసిన భారత సైన్యం. దాడులకు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. ఒంటి గంట 51 నిమిసాలకు ఆపరేషన్ ముగిసాక న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని మోదీ. వార్రూమ్ నుంచి లైవ్లో వీక్షించారు. కాగా.. ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఆపరేషన్ సిందూర్ పై సైన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. భారతదేశంపై జరిగిన ఉగ్రవాద దాడి వీడియోతో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఇది పహల్గామ్లో జరిగిన దాడిని కూడా చూపించింది.. దీనిలో 26 మంది మరణించారు. దశాబ్ద కాలంలో 350 మంది భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారని ఆ వీడియోలో వివరించారు. పాక్ ఉగ్రమూకలు లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగినట్లు సైన్యం వెల్లడించింది. నిర్ధిష్ట లక్ష్యాలు టార్గెట్గా పాక్పై దాడులు జరిగాయని.. పాక్లోని లష్కరే, జైషే, హిజ్బుల్ స్థావరాలు విజయవంతంగా ధ్వంసం అయ్యాయని ప్రతినిధులు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. మొత్తం 21 ప్రాంతాల్లోని స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. అంతర్జాతీయ సరిహద్దులు దాటి దాడి చేసిన భారత్..
పౌర, సైనిక స్థావరాలకు నష్టం కలుగుకుండా కచ్చితత్వం పాటించింది. కసబ్, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలు ధ్వంసం చేసింది. శాటిలైట్ చిత్రాలతో దాడులను సైతం భారత్ వివరించింది. దేశ ప్రయోజనాల కోసం తన హక్కును భారత్ ఉపయోగించుకుందని.. బాధ్యతాయుతంగానే దాడి చేశామని భారత్ ప్రకటించింది…
మేము మా హక్కును వినియోగించుకున్నాము: MEA
ఈ రోజు భారతదేశం తన హక్కును వినియోగించుకుందని విదేశాంగ కార్యదర్శి అన్నారు. మేము అన్నింటి ప్రకారం చర్య తీసుకున్నాము. మేము ప్రత్యుత్తరం ఇచ్చే హక్కును వినియోగించుకున్నాము. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసే లక్ష్యంతో ఈ చర్య జరిగిందన్నారు.
25 నిమిషాల్లో 21 లక్ష్యాలపై భారత్ దాడి చేసింది..
ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం అందించామని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. పాకిస్తాన్ పై తెల్లవారుజామున 1:05 గంటలకు దాడి జరిగిందని ఆమె తెలిపారు. ఈ ఆపరేషన్లో 9 చోట్ల దాడి జరిగింది. ఈ ఆపరేషన్ మధ్యాహ్నం 1.05 నుండి 1.30 వరకు కొనసాగింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా లక్ష్యంపై దాడి జరిగింది. ఉగ్రవాద దాడి కుట్రదారులపై దాడి జరిగింది. పాకిస్తాన్ – పీఓకే రెండింటిపైనా దాడులు జరిగాయి. మేము పౌరులకు హాని చేయలేదు. ముందుగా, సవాయి నాలా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాము.. మేము జైషే, లష్కర్ శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాము. 9 చోట్ల 21 లక్ష్యాలపై దాడి జరిగింది. పాకిస్తాన్లోని సియాల్కోట్లో దాడి జరిగింది. ఇక్కడి సర్జల్ శిబిరంపై దాడి జరిగింది. ఇక్కడ ఒక హిజ్బుల్ శిబిరం ఉండేదని తెలిపారు…