ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై సెటైరికల్ పోస్ట్ వేసిన తెలంగాణ విద్యా కమిషన్ సలహాదారు సభ్యురాలు సుజాత సూరేపల్లి…!

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్టు పట్ల నెటిజన్లు, రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై సెటైరికల్ పోస్ట్ వేసిన తెలంగాణ విద్యా కమిషన్ సలహాదారు సభ్యురాలు సుజాత సూరేపల్లి..

సిందూరం అంటే రక్త సిందూరం లాంటిదా? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని… యుద్ధాలు శవాలను, శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు” అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో బుధవారం పోస్టు చేశారు. ఇది వైరల్‌గా మారింది.

ఆ పోస్టుపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఆపరేషన్‌ సిందూర్‌ను ఎగతాళి చేసిన ప్రొ.సుజాత ముమ్మాటికి దేశ ద్రోహేనంటూ బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆపరేషన్‌ సిందూర్‌ను తప్పుబట్టేవిధంగా ఆమె వ్యవహరించిన తీరు దుర్మార్గమని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర విద్యాకమిషన్‌ సభ్యురాలిగా ఉండి సుజాత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. తక్షణమే ఆమెను సస్పెండ్‌ చేసి, విద్యా కమిషన్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు..

ఇండియన్ ఆర్మీపై అనవసరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. సుజాత సూరేపల్లిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి!!..