ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… అపర కుబేరులు అదానీ అలాగే అంబానీ ఇద్దరు స్పందించారు. దేశానికి ఏం కావాలన్నా…మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. పాకిస్తాన్ దేశంపై గెలిచి… ఇండియా సత్తా చూపాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
https://x.com/gautam_adani/status/1920526683544719464?t=3lXQuuxhcdoiTOztjyy4jw&s=19
పాక్ తో యుద్ధంలో ఇండియాకు పూర్తి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ మేరకు వారి వారి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మన ఐక్యత అలాగే నిజమైన బలం బయటకు వస్తుందని ఆదానీ పోస్ట్ పెట్టారు.
దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటామని, దేశ ప్రజలకు ఏది కావాలన్నా చేసి చూపిస్తామని పేర్కొన్నారు. అటు ముఖేష్ అంబానీ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచి ఎందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.