*🔹పాకిస్థాన్ సంచలన ప్రకటన*
_• భారత్ పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్థాన్ ప్రకటించింది._
తెల్లవారుజామున ప్రెస్ మీట్ నిర్వహించిన ఆ దేశ ఆర్మీ భారత్ పై వార్ కు ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్’ అని పేరు పెట్టింది.
_• దీంతో దాడులను ఆ దేశం మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది._
*• మరోవైపు మరికాసేపట్లో భారత ఆర్మీ సైతం ప్రెస్ మీట్ నిర్వహించనుంది..
భారత్‌ను నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాక్ సైన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరాయుధులైన ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. ఆస్తులను ధ్వంసం చేస్తున్నది. శుక్రవారం మరో ఇద్దరు అమాయకులను బలిగొన్నది. వీరితోపాటు ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. మరోవైపు యుద్ధ సమయంలో కనీస ధర్మం పాటించకుండా ప్రార్థనా మందిరాలపై పాక్ దాడులు చేస్తున్నది. పౌర విమానాలను, విద్యార్థులను రక్షణ కవచాలుగా వాడుకునే దుస్థితికి దిగజారింది. పాక్ చేస్తున్న దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతున్నది..