పీఎస్ఎల్ 2025 వాయిదా!.. యూఏఈ.. పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌ ఆడేందుకు నిరాకరణ..!

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ వాయిదా పడింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పీఎస్ఎల్ 2025ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది..

దేశ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ ఆదేశాల మేరకు పీఎస్ఎల్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని పీసీబీ తెలిపింది. అయితే, అంతకుముందు ఉదయం.. లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించనున్నట్టు పీసీబీ వెల్లడించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విదేశీ క్రికెటర్లు లీగ్‌లో కొనసాగేందుకు విముఖత చూపడం, స్వదేశాలకు తరలించాలని కోరడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మరోవైపు, పీఎ్‌సఎల్‌ మ్యాచ్‌ల ఆతిథ్యానికి యూఏఈ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కూడా విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. యూఏఈలో ఇండో-పాక్‌ క్రికెట్‌ అభిమానులు భారీ సంఖ్యలో ఉంటారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పీఎస్ఎల్‌ను నిర్వహిస్తే ఫ్యాన్స్‌ మధ్య ఘర్షణలు, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఈసీబీ భావిస్తోందట. పైగా బీసీసీఐతో ఈసీబీకి బలమైన సంబంధాలు ఉండడంతో.. పీఎ్‌సఎల్‌కు నో చెప్పాలని అనుకొంటుందని సమాచారం.