*మే18వ తేదీన పోప్ అధికారిక ప్రమాణ స్వీకారం*
నూతన పోప్ లియో14 మే 18న అధికారికంగా పోప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈసందర్భంగా ఆయన సెయింట్ పీటర్స్ స్క్వేర్ మొదటి బహిరంగ ప్రార్థన నిర్వహిస్తారు. ఆ తరువాత మొదటి సాధారణ సమావేశం మే 21న జరగనుంది. అయితే పోప్ ఫ్రాన్సిస్ మరణంతో సాంకేతికంగా ఉద్యోగాలు కోల్పోయిన వాటికన్ సంస్థల అధిపతులు, సభ్యులందరూ తదుపరి నోటీసు వచ్చేవరకు పదవిలో ఉండాలని లియో కోరారు.