న్యూస్ అప్డేట్స్..

మెహఫిల్ బిర్యానీలో బల్లి

ఇదేమిటని అడగగా మంచిగా ఫ్రై అయింది తినమన్న యజమాని

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో కస్టమర్ చికెన్ బిర్యానీ తింటుండగా బిర్యానీలో ప్రత్యక్షమైన బల్లి

బల్లి రావడంతో ఒక్కసారిగా కంగుతిన్న కస్టమర్

ఇదేమిటని రెస్టారెంట్ యజమానిని నిలదీయడంతో మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో ఆగ్రహానికి గురైన బాధితుడు

గుజ్జా కృష్ణ రెడ్డి షేరిగూడ గ్రామం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మేనేజర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు..

వేతనం సమయానికి రాక.. ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య

హైదరాబాద్ – రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోవర్ధన్ అనే హోంగార్డు ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య

అయితే గోవర్ధన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కూతురికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్యం చేయిస్తున్నాడు.. కాని జీతం సమయానికి రాక, కూతురుకు వైద్యం చేయించలేక అవస్థలు పడుతున్న హోంగార్డు గోవర్ధన్

ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఫ్యానుకు ఉరేసుకున్న గోవర్ధన్

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి

హైదరాబాద్ – గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్‌ నుండి వచ్చి ఒక అపార్టుమెంటులో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు

వీరికి ఒక కొడుకు, కూతురు ఉండగా, అనారోగ్యంతో కొడుకు మృతి

14 రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించగా, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్ళలో నిద్రిస్తున్న పసికందును బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతుకోసి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పెట్టిన తండ్రి

ఒక గంట తరువాత నిద్ర లేచిన గౌరి పాప ఎక్కడని నిలదీయగా, చంపేసి గోనె సంచిలో పెట్టానని చెప్పిన జగత్

దీంతో గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చేందుకు బయటకు వెళ్లిన సమయంలో, మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసిన తండ్రి

గౌరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, జగత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు….

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మంత్రులు కమిషన్లు తీసుకుంటారని కొండా సురేఖ ఒప్పుకుంది

ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారో కూడా కొండా సురేఖ చెప్పాలి

మంత్రుల కమిషన్లపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ప్రేమ పేరుతో మైనర్‌ను ట్రాప్ చేసిన యువకుడు

అక్కను ట్రాప్ చేసి చెల్లిని కూడా తీసుకురావాలని బలవంత పెట్టిన యువకుడు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితురాలు

రాచకొండ పోలిస్ కమీషనర్ రేట్ ఘట్కేసర్‌లో ఘటన

అక్క, చెల్లె ఇద్దరినీ ప్రేమ పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన అవినాష్ రెడ్డి

ఇన్‌స్టాగ్రాంలో పరిచయమై.. ఫొటోలు, వీడియోలు దిగి చివరకు తనకు ప్రియురాలి చెల్లెలు తనకు కావాలంటూ అక్కను బ్లాక్ మెయిల్ చేసిన అవినాష్

ఫోటోలు వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని చెప్పిన అవినాష్ రెడ్డి

తప్పనిసరి పరిస్థితిలో తీసుకెళ్లి ఇచ్చిన అక్క

ప్రియురాలితో చివరకు చెల్లెను తీసుకరమ్మని చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మైనర్

మైనర్‌ల తండ్రి పిర్యాదుతో కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు.

కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్డిలకు, గౌడ్లకు పదవులు ఇస్తున్నారు.

మొగుళ్ళు పనిచేస్తే పెళ్ళాలకి పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే

మరి మేము పెళ్ళాలము పనిచేస్తున్నాము.. మా మొగుళ్ళకు కూడా పదువులు ఇవ్వండి – మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు…

మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడు

పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి.. మా చెల్లెళ్ళకు మాత్రం రావడం లేదు – మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు….

నా వ్యాఖ్యలను వక్రీకరించారు..మంత్రి కొండా సురేఖ..

నేను బీఆర్ఎస్ హయాంలో పనులు చేయాలంటే అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారు అని చెప్పాను

నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ఈ అంశంపై ఈరోజే మరింత క్లారిటీ ఇస్తాను..