తిరుపతిలో ‘ అపచారం … ” మద్యం సేవించి హల్చల్ చేసిన పోలీస్లు..!

తిరుపతిలో ‘ అపచారం … ” మద్యం సేవించి హల్చల్ చేసిన పోలీస్ ”

*తిరుమల శ్రీవారి సన్నిధిలో:*

▪️తిరుమలలో శ్రీవారి సన్నిధిలో పోకిరీ పోలీసులు.

▪️తప్పతాగి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైకి వెళ్లిన ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు.

▪️హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలలో రోజుకో అపచారం.

▪️ఘాట్ రోడ్డుపై ఇతర వాహనాలను ఢీకొడుతూ తిరుమలకు వచ్చిన కానిస్టేబుళ్లు.

▪️అసలు అలిపిరిలో వీరిని టీటీడీ భద్రత సిబ్బంది గుర్తించలేదా.

*▪️తరచుగా ఇలాంటివి జరుగుతున్నా టీటీడీ పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్న భక్తులు.*

*▪️పోలీసులే ఇలా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తప్పతాగి చిందులు వేస్తుంటే ఉన్నత అధికారులు, చైర్మన్ ఏమీ. చేస్తున్నట్లు.*

*▪️భక్తులు టీటీడీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వెంటేనే ఈ పోకిరీ పోలీసులను సస్పెండ్ చేసి వారి ఫై చర్యలు తీసుకోవాలని సోషియల్ మీడియాలో పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు.*

*▪️ఈ దృశ్యాలు వైరల్ కావడంతో మౌనంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటూ ఆరోపణలు..

ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గుర్తించారు. డ్రంక్ డ్రైవ్ టెస్ట్లో 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. ఓ కానిస్టేబుల్ ఘటన స్థలం నుంచి పరారీ కాగా, పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా, తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్కు సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్ చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు.

మద్యం సేవించడం, ఎగ్ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలను మర్చిపోకముందే.. ఇప్పుడు ఏకంగా కల్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు..