3 గంటలపాటు పలు జిల్లాల్లో వర్షాలు!
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 7 గంటల వరకు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, జనగామ, గద్వాల్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని తెలిపింది.