జపాన్కు చెందిన ప్రైవేట్ సంస్థ చంద్రుడిపైకి చేపట్టిన ప్రయోగం విఫలమైంది. ఐస్పేస్ సంస్థ పంపిన లూనార్ ల్యాండర్ కుప్పకూలింది…మరో రెండు నిమిషాల్లో చంద్రుడిపైన మినీ రోవర్ ల్యాండవుతుందనగా మిషన్తో సంబంధాలు తెగిపోయాయని ఐస్పేస్ సీఈవో టకేషి హకామడ తెలిపారు. రెండేళ్ల క్రితం ఐస్పేస్ చేపట్టిన మొట్ట మొదటి ప్రయోగం విఫలమైంది. దీంతో, ఈసారి ‘రిసైలెన్స్’ పేరుతో పక్కాగా ఈ ప్రయోగం చేపట్టినట్లు అంతకుముందు టకేషి చెప్పారు.
Mission Failed: Japan’s ispace Confirms Its Moon Lander Crashed During Descent..
ఈ ప్రయోగానికి సుమారు రూ.815 కోట్లు ఖర్చయిందని ఐస్పేస్ సీఈవో టకేషి చెప్పారు. అయితే, 2027లో నాసాతో కలిసి భారీ ల్యాండర్ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. చంద్రుని ఉపరితలంపై ఉంచడానికి స్వీడన్ కళాకారుడు తయారు చేసిన బొమ్మ పరిమాణంలోని ఎర్రటి ఇంటిని, చంద్రుని మట్టిని సేకరించడానికి పారతో కూడిన రోవర్ రిసైలెన్స్లో ఉన్నాయి. రిసైలెన్స్లో ఉన్న లేజర్ వ్యవస్థ నిర్దేశించిన ప్రకారం ఎత్తును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ల్యాండర్ అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి, ధ్వంసమైనట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఐస్పేస్ ఒక ప్రకటనలో తెలిపింది.. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్నది ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...