గుజరాత్‌: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం..

*🔹గుజరాత్‌: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం.*
మేఘాని ప్రాంతంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్‌ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. జనావాసాలపై విమానం కూలినట్లు చెబుతున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు.

_• మేఘానిలో కూలిన ఎయిర్‌ఇండియా విమానం.

_• సివిల్‌ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిన విమానం టేకాఫ్‌ అయిన వెంటనే కూలిన విమానం._

_• విమానంలో 242 మంది ప్రయాణికులు._

_• పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న విమానం._

_• చెట్టును ఢీకొట్టి జనావాసాలపై కూలిన విమానం._

_• ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు కొనసాగుతున్న సహాయక చర్యలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది._

_• సహాయకచర్యల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది._

గురువారం మధ్యాహ్నం 1.17 నిమిషాలకు విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో అత్యధికంగా 52 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. అలాగే, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా అనేక మంది ఈ విమానంలో ఉన్నారు…

విమానంలో 169 మంది భారతీయులు
ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 169 మంది భారతీయులు.. 53 మంది బ్రిటన్ పౌరులు.. ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడా పౌరుడు ఉన్నట్టు గుర్తించారు…

సాయంత్రం వరకూ ఎయిర్‌పోర్ట్ మూసివేత
ఎయిరిండియా విమాన ప్రమాదంతో అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సాయంత్రం 5 గంటలకు విమానాల రాకపోకలను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు..

ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?.
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తోన్న విమానం కూలిన ఘటనలో ఇప్పటి వరకూ 100 మందికిపైగా మృతిచెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్యపై అధికారంగా ప్రకటన రావాల్సి ఉంది..

విమానంలో ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది.

లండన్‌కు వెళ్తున్న విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా మొత్తం 12 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు…

అధిక ఇంధనంతో భారీగా మంటలు..

ఎక్కువ దూరం కావడం వల్ల విమానంలో భారీగా ఇంధనం నింపడంతో, ప్రమాదం తర్వాత సంభవించిన పేలుడు, మంటలు తీవ్రత భారీగా ఉంది…

విమానంలో 52 మంది బ్రిటన్ పౌరులు.

గురువారం మధ్యాహ్నం 1.17 నిమిషాలకు విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో అత్యధికంగా 52 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. అలాగే, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా అనేక మంది ఈ విమానంలో ఉన్నారు…

చెట్టును ఢీకొట్టిన విమానం.

విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా తొలుత అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన తర్వాత జనావాసాలపై పడింది. సరిగ్గా మధ్యాహ్నం 1.17 గంటలకు విమానం టేకాఫ్ అయ్యింది.