Letest news… లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్.

విమాన ప్రమాదంలో 242 మంది మృతి..!.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా (242 మంది) చనిపోయి ఉంటారని ఆయన తెలిపారు. ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ సంచలన ప్రకటన చేశారు. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతైపోయారని తెలుస్తోంది…విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు..

రాష్ట్రంలో 36 మంది ఐఏఎస్ల బదిలీలు .

తెలంగాణ రాష్ట్రంలో భారీగా స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. ఒకేసారి 36 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేేశారు. బదిలీలను చూస్తే..

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్
గనులశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు
రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌
సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌గా లోకేశ్‌కుమార్‌ అదనపు బాధ్యతలు
ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్ మిత్తల్
ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్
దిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయెల్
హైదరాబాద్ కలెక్టర్‌గా హరిచందన దాసరి
రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ ప్రత్యేక కార్యదర్సి, ఐజీగా రాజీవ్‌గాంధీ హనుమంతు
స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా ఇ.నవీన్‌ నికోలస్‌
సమాచారశాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్
ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్‌గా కిల్లు శివకుమార్ నాయుడు
ప్రియాంక ఆల- టీజీపీఎస్సీ కార్యదర్శి
పి.ప్రావిణ్య- సంగారెడ్డి కలెక్టర్‌
మిక్కిలినేని మను చౌదరి- మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌
చిట్టెం లక్ష్మి – సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శి
టి.వినయ్‌ కృష్ణారెడ్డి- నిజామాబాద్‌ కలెక్టర్‌
సృజన- మహిళాశిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు
ఎల్‌.శివశంకర్‌- వ్యవసాయ సహకార శాఖసంయుక్త కార్యదర్శి, విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
కె.హైమావతి- సిద్దిపేట కలెక్టర్‌
పి.గౌతమ్‌- సింగరేణి డైరెక్టర్‌
వాసం వెంకటేశ్వర్‌రెడ్డి- ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ డైరెక్టర్‌
కె.నిఖిల- మత్స్యశాఖ డైరెక్టర్‌
వల్లూరు క్రాంతి- పర్యాటకశాఖ ఎండీ
పి.ఉదయ్‌ కుమార్‌- ఆరోగ్యశ్రీ హెల్త్‌ ట్రస్ట్‌ సీఈవో
ప్రియాంక ఆల- టీజీపీఎస్సీ కార్యదర్శి
పి.ప్రావిణ్య- సంగారెడ్డి కలెక్టర్‌
మిక్కిలినేని మను చౌదరి- మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌
అనుదీప్‌ దురిశెట్టి- ఖమ్మం కలెక్టర్‌
స్నేహ శబరీష్‌- హనుమకొండ కలెక్టర్‌
ముజామిల్‌ ఖాన్‌- పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌..

తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.!.

ఉత్తరప్రదేశ్‌ నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు కొనసాగిన ఆవర్తన ద్రోణి బలహీన పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది….ఉత్తరాంధ్ర, కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈనెల 17వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.

బుధవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాతోపాటు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వివరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసినట్టు తెలిపింది. రాబోయే 48 గంటలు ఆకాశం మేఘావృతమై ఉండి, హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతోపాటు, ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. 24 గంటల్లో భద్రాది కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో అత్యధికంగా 8.22 మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది..

రేవంత్ తీరుపై వేముల ప్రశాంత్ ఫైర్..

గల్లీలో గలీజ్ దందాలు చేస్తూ ఢిల్లీలో గులాం గురి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు..తెలంగాణ భవన్‌లో వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ చేశారు. మంత్రుల శాఖల కేటాయింపు కోసం, కాంగ్రెస్ పార్టీ అధినేతల అపాయింట్‌మెంట్‌ కోసం రెండు రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసి అపాయింట్‌మెంట్ దొరకని ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నాడు. కేసీఆర్, కిషన్ రెడ్డి ఒక్కటే అని రేవంత్ రెడ్డి అన్న మాట అబద్ధం, అవాస్తవం. రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటి అన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి ,బీజేపీ దోస్తాన్ చాలా సార్లు బయట పడింది. లోక్‌సభ ఎన్నికల్లో బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ ఎంపీలు గెలవడానికి రేవంత్ రెడ్డి సహాయ పడ్డారు. స్వయంగా ఈ మాట బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌ను గెలిపించడానికి వేరే ప్రాంతం నుంచి సునీతా మహేందర్ రెడ్డిని నిలబెట్టారు. కిషన్ రెడ్డిని గెలిపించడానికి బీఆర్ఎస్‌లో ఉన్న దానం నాగేందర్‌ని సికింద్రాబాద్‌లో నిలబెట్టారు. కాంగ్రెస్ నుండి గతంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి కాదని ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వెలిచాల రాజేందర్‌కు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌పై పోటీకి నిలిపారు. ఇలా నిజమాబాద్‌లో అరవింద్‌పై, మెదక్‌లో రఘునందన్‌పై, ఆదిలాబాద్‌లో నగేశ్‌లపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బలహీన అభ్యర్థులను నిలబెట్టారు. 8 మంది బీజేపీ ఎంపీలలో 7 మందిని రేవంత్ రెడ్డినే గెలిపించారు. బీజేపీ పార్టీ కూడా రేవంత్ రెడ్డిపై ఈగ వాలనివ్వడం లేదు అని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు.

స్వయంగా ప్రధాని మంత్రి మోదీ ఎలక్షన్ ప్రచారంలో తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని మాట్లాడిన ఈడి, సీబీఐ ఎందుకు రావడం లేదు..? ఓటుకు నోటు కేసు ఎటుపోయింది, ఎందుకు జాప్యం జరుగుతోంది..? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకదు కానీ ప్రధానిని కలవడానికి 15 నిమిషాల్లో అపాయింట్‌మెంట్ ఎలా దొరుకుతుంది..? బండి సంజయ్ బహిరంగంగానే రేవంత్ రెడ్డి పదవి కాపాడుకోవాలని సూచనలు ఇస్తున్నాడు. బీఆర్ఎస్‌ను రాజకీయంగా బొంద పెట్టడానికి కాంగ్రెస్, బిజెపి కలిసి పని చేయాలి అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనే సంకేతం బండి సంజయ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయితే స్వాగతిస్తామని ఎంపీ అరవింద్ అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి, బీజేపీ దోస్తానకు సంకేతము కాదా..? నేను బీజేపీ స్కూల్‌లో చదువుకున్న అని రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నారు. హైదరాబాద్‌లో అన్నది మోదీ విన్నాడో లేదో అని మళ్ళీ అవే మాటలు ఢిల్లీలో మాట్లాడిండు. బీజేపీలోకి వెళ్తాను అని సూచన ఇస్తున్నట్టున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డిని నమ్మకండి.. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి బీజేపీలోకి పోతారు అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ తెలంగాణకు ఆత్మ. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడుతున్న సందర్భంలో ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కు పెట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణకు శత్రువు. ఏపీకి చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తుంటే నోరు ముసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ శత్రువు. కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 4వ ప్లేస్‌కు, జీడీపీలో 4వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 13వ స్దానానికి దిగజార్చిన నువ్వు తెలంగాణ శత్రువు. తెలంగాణ అప్పుల పాలైందని, తెలంగాణ ముఖ్యమంత్రిగా వెళ్తే దొంగలా చూస్తున్నారని తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు శత్రువు అని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకురాలే. ఆంద్రప్రదేశ్‌లో ఉన్న టీడీపీ ఎంపీలు వేల కోట్లు నిధులు తెచ్చుకున్నారు. నిధుల వరద ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుపోతున్నారు. పోలవరం, అమరావతి రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వేల కోట్లు, బనకచర్లకు జాతీయ హోదా తెస్తుంటే మన కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఒక్క రూపాయి కూడా తెలంగాణకు తేవట్లేదు. కాబట్టి తెలంగాణకి అసలైన శత్రువులు బీజేపీ కాంగ్రెస్ పార్టీలే..? బీఅరెస్ పార్టీకి, కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఉంటే తెలంగాణకు ఈ గతి పట్టేదా. 45 సార్లు ఢిల్లీకి పోతే 4 సార్లు కూడా రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరకలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బతుకు అలా ఉంది అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు..

ఎంఐఎంకు తొత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ..ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.!

ఎంఐఎంకు తొత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బక్రీద్ అనంతరం మైలార్దేవుపల్లిలో జరిగిన సంఘటనలో అరెస్ట్ అయ్యి రిమాండ్ కు తరలించిన యువకులను గురువారం చర్లపల్లి జైలులో రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు, రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ తో కలిసి గో రక్షక్ కార్యకర్తలను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఐఎం తొత్తులుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఎంఐఎం కార్యకర్తలను అరెస్టు చేసే దమ్ము కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా అని తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే చాలా సిగ్గుచేటు గా ఉందని, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ రోహింగ్యాలను, బంగ్లాదేశ్ లను పెంచి పోషిస్తుందని అన్నారు..

దక్కని మంత్రి పదవి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం దక్కకపోయినా, తాను దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా తీసుకోనని, పదవి లేకపోయినా ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం నిరంతరంగా శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు..తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్‌లో… “రాజకీయాల్లో పదవులు, హోదాలే కీలకమైతే ప్రజల సేవకు గమ్యం దొరకదు. నాకు పదవి లేదు కాబట్టి నేను వెనక్కి తగ్గనన్న మాట కాదని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే నా ప్రధాన ధ్యేయమని” తెలిపారు.

ఇటీవల కేబినెట్‌లోకి వచ్చిన కొత్త మంత్రులను అభినందిస్తూ.. వారికి ప్రజాసేవలో విజయాలు కలగాలని ఆకాంక్షించారు. “పదవులు కాకుండా ప్రజల మీద ఉన్న నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం మీద కలలే నాకు ప్రేరణ. అందుకే మళ్లీ కాంగ్రెస్‌లో చేరాను” అని పేర్కొన్నారు. రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదని, పదవి లేకపోయినా ప్రజల మధ్య ఉండే అవకాశాన్ని తాను శక్తిమంతమైనదిగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజకీయ వైఖరికి అద్దం పడుతున్నాయని, ఆయన పార్టీ పట్ల నిజమైన విధేయతను చూపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, గత కొంతకాలంగా ఆయన మునుగోడు నియోజకవర్గంలో కార్యకలాపాలను మరింత ఉధృతం చేశారు.

పదవులు మారినా, స్థానాలు మార్చినా తన లక్ష్యం మాత్రం ప్రజల అభివృద్ధే అని మరోసారి స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ ప్రకటనతో తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలకు దారితీసే సంకేతాలనిచ్చారు..

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఎన్డీయే కూటమి…సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జోస్యం.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఎన్డీయే కూటమి సర్కారేనని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు..టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని తెలిపారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తాజాగా జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యా ఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేస్తాయని సోమిరెడ్డి ముందస్తు సంకేతాలు ఇచ్చినట్టుగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు..