కాంగ్రెస్- బీజేపీల మధ్య మరోమారు దుమారం..పాకిస్తాన్ ముస్లిం లీగ్- జైరామ్ రమేష్ ఓక్కటే: బీజేపీ ఘాటు విమర్శ
కాంగ్రెస్- బీజేపీల మధ్య మరోమారు దుమారం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన సైనిక కవాతుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను అమెరికా ఆహ్వానించిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది…అమెరికా ఈ నకిలీ వార్తలను ఖండించిందని పేర్కొన్న బీజేపీ.. పాకిస్తాన్న్కు కాంగ్రెస్ మౌత్పీస్గా మారిందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ వైఖరి అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిందని పేర్కొంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారని, దీనిపై విలేకరుల సమావేశంలో ప్రస్తావించారని, అయితే మునీర్ అమెరికా వెళ్లడం లేదని తేలిందని బీజేపీ నేత చెందిన నిషికాంత్ దూబే మీడియాకు తెలిపారు. కాంగ్రెస్.. పాక్కు మౌత్ పీస్ మాదిరిగా ప్రవర్తిస్తూ, ప్రజలను ఇలా తప్పుదారి పట్టిస్తున్నదని, పాకిస్తాన్ ముస్లిం లీగ్- జైరామ్ రమేష్ మధ్య తేడా ఏమిటని దూబే ప్రశ్నించారు..