🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪷పంచాంగం🪷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 20 – 06 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
బహుళ పక్షం,
తిథి : *నవమి* ఉ6.34 వరకు,
తదుపరి *దశమి* తె4.10 వరకు,
నక్షత్రం : *రేవతి* రా7.13 వరకు,
యోగం : *శోభన* రా9.54 వరకు,
కరణం : *గరజి* ఉ6.34 వరకు,
తదుపరి *వణిజ* సా5.22 వరకు,
ఆ తదుపరి *భద్ర* తె4.10 వరకు,
వర్జ్యం : *ఉ7.57 – 9.27,*
దుర్ముహూర్తము : *ఉ8.06 – 8.58,*
మరల *మ12.27 – 1.19,*
అమృతకాలం : *సా4.58 – 6.28,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 5.30,
సూర్యాస్తమయం: 6.32,
*_నేటి మాట_*
*సత్పురుషుల యొక్క దర్శన భాగ్యం, వారి సాంగత్యం వల్ల లాభం ఏమిటి???*
ఈరోజుల్లో ఎవరైనా ఒక సత్పురుషుల దర్శన భాగ్యం,
ఎవరైనా ఒక మహానుభావుల సాంగత్యం, కొరకు ప్రయత్నం చేస్తే, వారిని గేలి చేయడం చేస్తున్నారు,
కొందరు వారికి ఏమీ తెలియదు, ఇంకొకరిని వెటకారం చేస్తూ ఉంటారు,
ఇది అంతా కలి మాయ మాత్రమే…
మనం ఏదైనా ఒక పని చేసే ముందు, దానిని అనుభవించి చూడాలి,
ఏదైనా అనుభవపూర్వకంగా మాట్లాడినపుడే మనకు విమర్శించే హక్కు ఉంటుంది, లేకపోతే అది అహంకారం అవుతుంది…
ఆదిశంకరాచార్యులు కూడా…
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః
… _అంటూ ఉపదేశించారు…_
ఒకసారి… నారదమహర్షి సత్సాంగత్య ఫలం గురించి చెప్పమని శ్రీ మహా విష్ణువును అడిగాడట,
అదేమిటో అనుభవపూర్వకంగానే చెప్పాలనుకున్నాడు శ్రీ మహా విష్ణువు.
‘నారదా! మొదట తూర్పు వైపు వెళ్లి ఒక పశువులశాలలో పేడపురుగును,
పశ్చిమదిశగా వెళ్లి పాడుపడిన దేవాలయంలో పావురాన్ని అడిగి నీ సందేహం తీర్చుకో’ అన్నాడు…
నారదుడు వాటిని అడగ్గానే అవి ఆయన పాదాలమీద పడి ప్రాణాలు విడిచాయట,
మహర్షి చింతిస్తూ శ్రీ మహా విష్ణువుకు ఈ విషయం విన్నవించగా..
‘ అయితే ఈసారి ఉత్తరదిక్కుకు వెళ్లు, అక్కడి సంస్థానంలో రాజుకు బిడ్డ పుట్టాడు, “అతడు నీ సందేహాన్ని తప్పక తీర్చగలడు” అన్నాడుట,
మళ్లీ ఏమవుతుందోనని నారదుడు సంకోచించడం చూసి, ‘ఎలాంటి సందేహాలూ అవసరం లేదు’ ఈసారి నిర్భయంగా వెళ్లు! అంతా శుభమే’ అన్నాడు శ్రీ మహా విష్ణువు,
నారదుడు రాజ మందిరంలో శిశువును ప్రశ్నించిన మరుక్షణం ఆ పసికందు ఒక దేవతగా మారి …
” నారదునికి ప్రణమిల్లి ‘దేవర్షీ! అలా ఆశ్చర్యపోతున్నారేమిటి? మీరు చూసిన పేడపురుగును నేనే, తమరి దివ్య సందర్శనంతో పావురంగా జన్మించాను”.
“మరోసారి తమరి దర్శనభాగ్యంతో రాకుమారుడిగా జన్మించాను, ఈసారి మీ దర్శనంతో దైవత్వం లభించింది” అని విన్నవించుకున్నారట,
‘ మహాత్ముల సాంగత్య మహిమ ఇంతటిది’ అంటూ దేవలోకానికి వెళ్లిపోయాడట, మహాత్ముల సాంగత్యం అంత గొప్పది…
వారి దర్శన, స్పర్శన, సాంగత్యం దొరకాలంటే పూర్వ జన్మ సుకృతం కూడా వుండాలి.
మహాత్ముల గూర్చి తెలుసుకోవడం చాలా కష్టం, విమర్శించడం చాలా సులువు.
*_🪷శుభమస్తు🪷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏