మాజీ సీఎం జగన్‌ సహా పలువురిపై కేసు నమోదు.!

గుంటూరు : ది డెస్క్

సింగయ్య మృతి..

పులివెందుల ఎమ్మెల్యే – మాజీ సీఎం జగన్‌ సహా పలువురిపై కేసు నమోదు.!

సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌ ను నిందితుడిగా చేర్చినట్టు గుంటూరు ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు.

ఆదివారం రాత్రి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

‘‘ఈనెల 18న జగన్‌ పల్నాడు పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న వృద్ధుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

సీసీ టీవీ ఫుటేజ్‌, డ్రోన్‌ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలు పరిశీలించాం.

మాజీ సీఎం జగన్‌ కారు కింద సింగయ్య పడినట్టు వీడియోలో ఉంది. ఆ దృశ్యాలు చూశాక.. మళ్లీ సెక్షన్లు మార్చి కేసు నమోదు చేశాం. డ్రైవర్‌ రమణారెడ్డి, మాజీ సీఎం జగన్‌, నాగేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిపై కేసు నమోదు చేశాం.

దొరికిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నాం. జగన్‌కు 14 వాహనాలకు అనుమతి ఇచ్చాం. తాడేపల్లి నుంచి కాన్వాయ్‌ మొదలైనప్పుడు 50 వాహనాల్లో వచ్చారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు..

అమరావతి :

పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి..!

జగన్ కారు కింద పడి సింగయ్య మృతి కేసులో అరెస్టు..?..

కారు నెంబర్ AP 40 DS 2349గా గుర్తింపు…

A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్, A3గా కారు యజమానిని చేర్చాలని నిర్ణయం…

వైసీపీ పేరిట కారు కొనుగోలు చేసిన జగన్ OSD కృష్ణమోహన్‌రెడ్డి…

ప్రమాదం జరిగినరోజు 304A సెక్షన్‌పై కేసు నమోదు…

జగన్ కారుకింద సింగయ్య మృతిచెందినట్లు పోలీసులు గుర్తింపు…

FIRలో అదనంగా 304 పార్ట్-2 సెక్షన్ చేర్చే అవకాశం…

BNS సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం.