ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దంలోకి ఉత్తర కొరియా ఎంటర్.ఇరాన్‌కు మద్దతుగా యుద్ధ సామాగ్రి అందిస్తాం…కిమ్‌.!.

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దంలోకి ఉత్తర కొరియా ఎంటర్ అయ్యింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను కిమ్ ఖండించాడు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది. ఇది సార్వభౌమ దేశ భద్రతా ప్రయోజనాలు, ప్రాదేశిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

North Korea – US Strikes On Iran.

ఇరాన్‌కు మద్దతుగా యుద్ధ సామాగ్రి అందిస్తామని కిమ్‌ తెలిపారు. ఇరాన్‌పై ఇంచి దాడులు జరిగితే.. వాటికి ఉత్తరకొరియా కూడా ధీటుగా స్పందిస్తుందంటూ కిమ్ హెచ్చరించాడు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు..