71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడు అయితే 74 ఏండ్లు ఉన్న మోడీ ని ఏమనాలి ?..మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…
*అహంభావంతో విర్రవీగుతు మర్యాద లేని కుసంస్కారి బీజేపీ ఎంపీ అరవింద్*
నీ మొఖానికి దిక్కులేక మోడీ మొహం వాడుకొని రెండు సార్లు ఎంపీ అయ్యావు
రెండుసార్లు ఎంపీ గా గెలిచి జిల్లా ప్రజలకు నువ్వు చేసింది గుండు సున్నా
రాజకీయ ఉద్దండులే మట్టి కొట్టుకుపోయారు ఆఫ్ట్రాల్ యాక్సిడెంటల్ ఎంపీ వి నువ్వెంత
సింహం లాంటి కేసీఆర్ పై గాడిద లాగ గాండ్రిస్తున్న అరవింద్ అహంకారాన్ని ప్రజలు పాతాళానికి తొక్కే రోజు దగ్గరలోనే ఉంది
71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడు అయితే 74 ఏండ్లు ఉన్న మోడీ ని ఏమనాలి ?
ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..
రాజకీయ ప్రయోజనాల కోసం అరవింద్ మతం పేరుతో ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజెపి ఎంపీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని మంత్రి అన్నారు.
నిజామాబాద్ ప్రజలు తమ తప్పును గ్రహించారని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా వారు దానిని పునరావృతం చేయరని, అరవింద్ ఓడిపోతారని ఆయన ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదు అన్నారు…. అహంకారపూరిత మాటలు ప్రజలందూరు వింటున్నారని.. రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు పట్ల అసభ్యకరంగా మాట్లాడితే రానున్న రోజుల్లో నీకు తిప్పలు తప్పవు అని హెచ్చరించారు..