అధిక వడ్డీల ఆశ చూపి భారీ ఎత్తున వసూలు చేసిన పాతికేళ్ల యువకుడు…..

నల్గొండ : బ్రేకింగ్…

జనాల్లో ఆశ చావనంత వరకూ నేరగాళ్లు పెరుగుతూనే ఉంటారు. బోగస్ సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అధిక వడ్డీల పేరు చెప్పగానే ఇంకేంముందని ఉన్నదంతా ఊడ్చి మరీ పెట్టుబడి పెట్టారు..

జిల్లాలో అధిక వడ్డీల పేరుతో బారీ స్కాం….

ఒక్కో లక్షకు రూ 10 నుంచి రూ 16 వడ్డీ అంటూ బురిడి…

జనాలకు అధిక వడ్డీల ఆశ చూపి బారీ ఎత్తున వసూలు చేసిన పాతికేళ్ల యువకుడు….

ఏజెంట్ల సహాయం తో జిల్లా వ్యాప్తంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసిన కేటుగాడు….

వడ్డీ వస్తుందన్న ఆశతో ముఠా వలకు చిక్కిన భాదితులు….

దేవరకొండ,మిర్యాలగూడ,హుజూర్ నగర్ సెగ్మెంట్ లలో జనాల నుంచి సుమారు 500 కోట్లు వసూళ్లు….

జనాల వద్ద దండుకున్న డబ్బుతో ఖరీదైన కార్లతో జల్సాలు,రియల్ ఎస్టేట్,స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు….

రెండు రోజుల క్రితం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ కు పిర్యాదు చేసిన కొందరు భాదితులు….

కలెక్టర్ ఆదేశాలతో ముఠా తీగ లాగుతున్న పోలీసులు……

జనాల్లో ఆశ చావనంత వరకూ నేరగాళ్లు పెరుగుతూనే ఉంటారు. బోగస్ సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అధిక వడ్డీల పేరు చెప్పగానే ఇంకేంముందని ఉన్నదంతా ఊడ్చి మరీ పెట్టుబడి పెట్టారు. ముందుగా నమ్మించేందుకు సక్రమంగా కొద్ది నెలల పాటు వడ్డీలు చెల్లించింది సంస్థ. ఇంకేముంది.. వాళ్లు మునిగింది కాక.. మరికొందరిని ముంచేశారు. మరికొందరికి చెప్పి అధిక వడ్డీలు వస్తాయని నమ్మబలికి వారితోనూ పెట్టుబడులు పెట్టించారు. ఇక అంతే అందరి డబ్బూ తీసుకుని ఆ యువకుడికి ధార పోశారు.. అది ఇప్పుడు బోగస్ అని తెలిసింది లబోదిబో అని మొత్తుకుంటూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు…