ఒక చిన్న పిల్లవాడిలా నేర్చుకుంటున్నా…భారత వైమానిక వ్యోమగామి శుభాంశు శుక్లా..

భారత వైమానిక వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం అంతరిక్షంలోకి ప్రయాణించిన తర్వాత గురువారం తొలిసారిగా లైవ్కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను భారత ప్రజలతో పంచుకున్నారు..”అందరికీ నమస్కారం. అంతరిక్షంలో భారరహిత స్థితిలో ఎలా తినాలో? ఎలా నడవాలో ఒక చిన్న పిల్లవాడిలా నేర్చుకుంటున్నా. నేను వేసింది చిన్న అడుగే అయిన చాలా కచ్చితత్వంతో దృఢంగా వేశాను” అని శుక్లా అన్నారు..భారత్, అమెరికా అంతరిక్ష సంస్థలు ఇస్రో, నాసా కలిపి చేపట్టిన మిషన్లో శుక్లా బృందం రోదసిలోకి వెళ్లింది. యాక్సియం-4 మిషన్లో భాగంగా ఫాల్కన్-9 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించారు.