నేటి పంచాంగం..నేటి మాట..

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 04 – 07 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *నవమి* సా4.25 వరకు,
నక్షత్రం : *చిత్ర* సా5.30 వరకు,
యోగం : *శివం* రా8.54 వరకు,
కరణం : *కౌలువ* సా4.25 వరకు,
తదుపరి *తైతుల* తె5.23 వరకు,

వర్జ్యం : *రా11.42 – 1.28,*
దుర్ముహూర్తము : *ఉ8.09 – 9.01,*
మరల *మ12.30 – 1.22,*
అమృతకాలం : *ఉ10.28 – 12.14,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *సా3.00 – 4.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.33,
సూర్యాస్తమయం: 6.35,

*_నేటి మాట_*

*భగవంతుడు భక్తుడి కోరికలు ఎప్పుడు తీరుస్తాడు??*
గర్భ గుడిలోని విగ్రహాన్ని బాగా మందంగా ఉన్న తెర నుండి చూస్తే కనిపించదు.
అదే పలుచని తెరగుండా చూస్తే మసక మసకగా కనిపిస్తుంది.
అదే పోలిధిన్ పేపరు ద్వారా చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది.
నిర్మలమైన అద్దం గుండా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది,

అలాగే ఈ క్షేత్రాల యొక్క వాసనల తెరను బట్టి పరమాత్మ వేరు వేరుగా కనిపిస్తుంటాడు.

తమోగుణాన్ని పూర్తిగా విడిచిపెట్టి, రజోగుణాన్ని తగ్గించుకుంటూ, సత్వగుణాన్ని పెంచుకొనుటకు ప్రయత్నిస్తూ ఉంటారో…
అట్టి వారిలో పురుషుడు భర్తగా ఉంటాడు!!…
సాధారణంగా భర్త అయినా ఏమి చేస్తుంటాడు…
భార్య కోరికలు తీరుస్తూ, ఆమె బాధలను, కష్టాలను తొలగించటానికి ప్రయత్నిస్తూ, భరిస్తూ ఉంటాడు.

అలాగే రజోగుణాన్ని తగ్గించుకొంటూ సత్వంలో నిలవటానికి ప్రయత్నిస్తూ ఉండే భక్తుని భగవంతుడు భర్త లాగా భరిస్తూ ఉంటాడు…
అతడికి కష్టనష్టాలు వస్తే వాటిని తొలగించటానికి ప్రయత్నిస్తాడు.
అతడి పోషణ భారం కూడా తానే వహిస్తాడు, వారి కోరికలను కూడా తీరుస్తూ ఉంటాడు.

*_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏