🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 07 – 07 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయణo,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *ద్వాదశి* రా10.14,
నక్షత్రం : *అనూరాధ* రా1.09
యోగం : *శుభం* రా10.45
కరణం : *బవ ఉ9.15 & బాలువ రా10.14,*
వర్జ్యం : మర్నాడు *తె3.04 – 4.50,*
దుర్ముహూర్తము : మ12.30-1.22,
మ3.06 – 3.58*
అమృతకాలం : *మ1.39 – 3.24,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
*సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 5.34,
సూర్యాస్తమయం: 6.33,
*_నేటి విశేషం_*
*చాతుర్మాస వ్రతారంభం*
*చాతుర్మాస్యం: వ్రత నియమాలు*
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః
చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు.
కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు.
చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది.
చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం
చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా
శ్రావణ మాసంలో ఆకుకూరలను భాద్రపద మాసంలో పెరుగును,
ఆశ్వయుజ మాసంలో పాలను
కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి.
వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు .
పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును
భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి.
ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు.
ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం.
వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింసపాటించాలి.
ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి.
భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి.
యోగసాధన చేయడం శ్రేయస్కరం.
దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.
*_🌿శుభమస్తు🌿_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏.
గమనిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959