రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..డాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నేడు విడుదల కాబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది.
కోదండపాణి(రవీచంద్రన్) భార్య శ్యామల లేట్ వయసులో గర్భవతి అవుతుంది. దీంతో ఊర్లో అంతా ఎగతాళి చేస్తుంటారు. సూటిపోటి మాటలతో అవమానిస్తుంటారు. ఆ అవమానం తట్టుకోలేక వాళ్లు తమ విజయనగరం ఊరుని వదిలేసి దూరంగా వెళ్లిపోతారు.
బస్సులో వెళ్తున్న క్రమంలోనే కోదండపాణి భార్య డెలివరీ అవుతుంది. కొడుకు అభిరామ్(కిరీటి)కి జన్మనిచ్చి శ్యామల కన్నుమూస్తుంది. దీంతో కొడుకుని ఎంతో గారాభంగా పెంచుతాడు కోదండపాణి.
కాకపోతే తండ్రి కొడుకుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ. తాత వయసుగా కనిపించే కోదండపాణి అభి తండ్రి అంటే అది చూసేవారికి, అభికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. పైగా పాత కాలపు ఆలోచనలతో కొడుకుని పెంచుతాడు కోదండపాణి. ఇది అభికి నచ్చదు.
పై చదువుల కోసం ఆయనకు దూరంగా వెళ్లిపోతాడు. అందుకు ముగ్గురు స్నేహితులను(శ్రీహర్షతోపాటు మరో ఇద్దరు) ఎంచుకుంటాడు. చిన్నప్పట్నుంచి తమ నాన్న వల్ల ఆ చిన్ననాటి తీపిగుర్తులను పొందలేకపోయానని బాధపడుతుంటాడు అభి.
అందుకే తన స్నేహితులతో కలిసి కిక్ కోసం, థ్రిల్ కోసం తాను చేయాల్సిన కొంటెపనులన్నీ చేస్తాడు. కాలేజీలోనూ గొడవలు పెట్టుకుంటాడు. ఈ క్రమంలో బస్‌లో స్ఫూర్తిని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె వెంటపడుతుంటాడు.
ఆమె కెరీర్, గోల్ అంటూ బిల్డప్ కొడుతుంది. అభిని పట్టించుకోదు, కానీ ఎప్పుడూ అల్లరి చేసే అభి తనకంటే ఎక్కువ మార్కులు సాధించడంతో ఆయనకు కనెక్ట్ అవుతుంది. ఆమె జాబ్ చేసే కంపెనీలోనే ఉద్యోగం తెచ్చుకుంటాడు అభి. అక్కడ ఛైర్మెన్(రావు రమేష్)ని ఇంప్రెస్ చేస్తాడు.
కానీ ఆ ఛైర్మెన్ కూతురు విజయ సౌజన్య(జెనీలియా)ని ఫస్ట్ డేనే చిరాకు పెడతాడు. దీంతో అతనిపై పగబడుతుంది విజయ. కొన్ని రోజుల్లోనే ఛైర్మెన్ రిటైర్మెంట్. దీంతో తన స్థానంలో తన కూతురు విజయని ఛైర్మెన్‌గా ప్రకటిస్తాడు.
ఆ ప్రకటన రోజు ఆమె పరువు తీస్తాడు అభి. ఆ సమయంలో ఛైర్మెన్ అభి నాన్నని చూస్తాడు. దీంతో షాక్ అవుతాడు. అభి ఎవరో తెలుస్తుంది. దీంతో కథ మొత్తం రివర్స్ అవుతుంది.
మరి అభి నాన్నని చూసి ఆయన ఎందుకు షాక్ అయ్యారు? వారికి ఆ ఛైర్మన్ కి ఉన్న సంబంధం ఏంటి? ఇంతకి విజయ ఎవరు? ఆమెకి అభికి ఉన్న రిలేషన్ ఏంటి? విజయ విజయనగరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ ఏం జరిగిందనేది మిగిలిన కథ..
.ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. అందుకే తగ్గట్టే ఈ సినిమాలోని కథ, కథనాలు కూడా అప్పటి లానే ఉంటాయి. ఒక్కగానొక్క కొడుకుని బొమ్మరిల్లు ఫాదర్ లా పెంచుతుంటే అది తట్టుకోలేని కొడుకు కాలేజీలో చేరి అమ్మాయి వెనకాల పడడం అక్కడ కొన్ని గొడవలు, అది చూసి హీరోయిన్ సదరు హీరోకి పడిపోడంవ, కాలేజీ అయ్యాక జాబ్ లో జాయిన్ అయితే అక్కడ లేడి బాస్ కి హీరోకి మధ్య ఇగోలు, చివరికి ఆ లేడి బాస్ కి ఇబ్బంది వస్తే హీరో సపోర్ట్ చేయడం సింపుల్ గా చెప్పాలంటే ఇదే కథ. ఎన్నో తెలుగు సినిమాలలో విన్నట్టు వుండే కథ చూసిపుడు కూడా ఎక్కడో చూసినట్టు ఉందే అనిపించేలా ఉంటుంది. భోజనాలలో విస్తరిలా అన్ని మిక్స్ చేసి తీసిన రెగ్యులర్ టెంప్లెట్ లో ఉంది. అయితే హీరోగా చేసిన కిరీటి నటన, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా చేసాడు. డాన్స్ లు అయితే జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ను అనుకరించి అదరగొట్టాడు. బహుశా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కావడంతో యాక్టింగ్ లో కూడా ఆయనని అనుకరించినట్టు అనిపిస్తుంది. శ్రీలీల ఉందంటే ఉంది అంతే. దేవిశ్రీ నేపధ్య సంగీతం బాగుంది. తొలి సినిమాకే మంచి పర్ఫామెన్స్ చేసిన కిరీటి మంచి కథలు పడితే స్టార్ గా ఎదుగుతాడనడం ఓ సందేహమే లేదు. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే జూనియర్ కు పర్లేదు అనే టాక్తె తెచ్చుకున్నాడు..