సీఎం సిద్దరామయ్య ఇటీవల చనిపోయిన దిగ్గజ నటి బి. సరోజాదేవి మృతికి సంతాపం తెలుపుతూ తన అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీన్ని మెటా చేసిన ఆంగ్ల అనువాదం ప్రస్తుతం రచ్చగా మారింది. దీనిపై కార్యకర్తలు సీరియస్ గా నిరసనలకు దిగారు. దిగ్గజ నటి సరోజా దేవి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె అకాల మరణానికి సంతాపం తెలుపుతూ సీఎం సిద్దరామయ్య తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ పెట్టారు. దీన్ని మెటా సంస్థ ఆంగ్లంలో కన్నడ నటికి బదులు.. సీఎం సిద్దరామయ్యలేరని అర్థం వచ్చేలా తప్పుగా అనువాదం చేసింది. దీంతో ఇది వెంటనే వైరల్గా మారింది. దీనిపై సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. మెటాను సున్నితంగా హెచ్చరిస్తు.. ఇక మీదట కన్నడ భాషను ఆంగ్లంలో అనువాదం చేయడం మానివేయాలన్నారు..ఈ ఫీచర్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కన్నడ నాట సిద్దరామయ్య అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ క్రమంలోనే.. తాజాగా దీనిపై మెటా సంస్థ దిగొచ్చింది. తమ మెటా టూల్ చేసిన తప్పిదానికి ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.