కాపు ఉద్యమ పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గత కొంత కాలంగా వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా చాలా నీరసంగా ఉంటున్నారు..ఈ క్రమంలో కొన్ని గంటల క్రితం ఒక్కసారిగా ఆయన హెల్త్ బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతో.. వెంటనే కాకినాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ టెస్టులు చేసిన వైద్యులు ముద్రగడను హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. దీంతో హుటా హుటీన పద్మనాభ రెడ్డిని ప్రత్యేకంగా వాహానంలో కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఆరోగ్యంపై కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది..వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలో చేసిన పోస్ట్ పెద్ద దుమారంగా మారిన విషయం తెలిసిందే. తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని.. తన సోదరుడు గిరి సరైన చికిత్సను చేయించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు…
ఇటీవల శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రం కావడంతో శనివారం (జూలై 19, 2025) రాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. మొదట ఆయన్ను కాకినాడలోని అహోబిలం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు నుంచి ఆయనను హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ముద్రగడ కుమారుడు గిరిబాబు తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. అయితే, ముద్రగడ కుమార్తె క్రాంతి గతంలో తన తండ్రికి క్యాన్సర్ ఉందని, సరైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు చేసిన సంగతి తెలిసి తెలిసిందే…