నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో నేడు అదిలాబాద్, ASFB, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, పెద్దపల్లి, KNR, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.