భారత సైన్యం అమ్ములపొదిలో ,అత్యంత శక్తిమంతమైన అపాచీ హెలికాప్టర్లు..!

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అపాచీ హెలికాప్టర్లు భారత సైన్యం అమ్ములపొదిలో చేరాయి. అమెరికా నుంచి రావాల్సిన అత్యాధునిక AH-64E అపాచీ హెలికాప్టర్లు ఇవాళ వాయుసేనకు అందాయి. తొలివిడతలో భాగంగా మూడు అపాచీ హెలికాప్టర్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. యూఎస్‌ అంతరిక్ష సంస్థ బోయింగ్‌ అమెరికా నుంచి రవాణా విమానంలో వీటిని భారత్‌కు చేర్చింది. ఈ హెలికాప్టర్లను దేశ పశ్చిమ సరిహద్దులకు చేరువలోని రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో మోహరించనున్నారు. అపాచీ హెలికాప్టర్ల రాక ఇప్పటికే 15 నెలలు ఆలస్యం కాగా, ఈ ఏడాది చివరిలోగా మరో మూడు రానున్నాయి. గగనతలం నుంచి శత్రుమూకపై ఉరుము లేని పిడుగులా నిప్పులు కురిపించే ఈ హెలికాప్టర్ల చేరికతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది..
ఇదొక మైలు రాయి
అమెరికన్ మేడ్ అపాచీ హెలీకాప్టర్లు చేరికను భారత సైన్యం ఒక మైలు రాయిగా అభివర్ణించింది. ఇది భారత సైన్యం కార్యాచారణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.