యాదాద్రి-భువనగిరి జిల్లాలో.. “అత్తా కోడలి మధ్య పంచాయతీ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం”.

యాదాద్రి-భువనగిరి జిల్లాలో.. “అత్తా కోడలి మధ్య పంచాయతీ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం”..

సంస్థాన్ నారాయణపురం మండలం, జనగామ గ్రామంలో.. అనే “శిరీష” అనే మహిళ కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. ఇంటి నిర్మాణ పెట్టుబడి కోసం అత్త, మామలను డబ్బులు అడిగింది శిరీష. ఆ డబ్బుల విషయంలోనే.. అత్తా-కోడళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అత్త మామలతో పాటు.. వారి కుటుంబ సభ్యులపైనా కోడలు పిర్యాదు చేసింది. కుటుంబ సమస్య కాబట్టి.. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సముదాయించారు. దీంతో.. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటుండగానే.. అత్తా, కోడళ్ల కు చెందిన వర్గాలు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. పోలీసుల సమక్షంలోనే పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు రెండు వర్గాలకు చెందిన వారు. ఇక ఆ గొడవను సద్దుమగించేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. కాసేపు నారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రాంగణమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది…….

కోడలు కొడుకుకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా అత్తామామలను కోడలు మరికొన్ని డబ్బులు అడిగింది ఈ విషయంలో కోడలికి అత్త మామకు గొడవ జరిగి కోడల్ని కొట్టారు. ఈ విషయంలో కోడలు అత్తమామలపై నారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. కోడలు తరఫున బంధువులు మాట్లాడడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన క్రమంలో మాటా మాటా పెరిగి ఇరువర్గాలు చితక్కొట్టుకున్నారు…