విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఇదీ గురుకులాల పరిస్థితి…
కాస్మెటిక్ చార్జీలు పెంచినం అని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ నాయకుల మాటలు అవాస్తవాలు అని తేల్చి చెప్పిన గురుకుల సిబ్బంది
మే, జూన్, జూలై నెలలకు ఇంతవరకు కాస్మెటిక్ చార్జీలు రాలేదని తెలిపిన గురుకుల సిబ్బంది
కింద పరుచుకునే బెడ్ షీట్లు సైతం గత సంవత్సరం ఇచ్చినవేనని హరీష్ రావుకు తెలిపిన విద్యార్ధిని..
నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌కు గురైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి ఫుడ్ పాయిజన్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల హాస్టల్‌కు వెళ్లి క్షుణ్నంగా పరిశీలించారు…ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకంత భయమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. ఆనాడు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల విద్యార్థిని మృతదేహాన్ని నిర్బంధాల మధ్య హైదరాబాద్ నుంచి తరలించారని తెలిపారు. నేడు ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల విద్యార్థులను దొంగచాటుగా పోలీసుల బందోబస్తు మధ్య తరలిస్తున్నారని మండిపడ్డారు.
గురుకులాల్లో విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేని దిక్కుమాలిన రేవంత్ సర్కారు.. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దుర్మార్గపు ఆలోచనలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు……
అంతకు ముందు..
హరీశ్‌రావు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో ఆస్పత్రి నుంచి విద్యార్థులను వెంటనే డిశ్చార్జి చేసి, పోలీసుల బందోబస్తు మధ్య ఇంటికి తరలించారు. కాగా, విద్యార్థులకు పూర్తిగా నయం కాకముందే డిశ్చార్జ్ చేయడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…