నీకు స్పీచులు రాసిచ్చే పీఆర్వోకు నీ మీద కోపం ఉన్నట్టు ఉంది
సోనియా గాంధీ రాలేనని అంటే అది నీకు అవార్డు అని రాసి నీ పరువు తీసిండు
నువ్వు ఒక ముఖ్యమంత్రివి.. ఎందుకు అందరూ తలదించుకునేలాగా మాట్లాడుతున్నావు
నువ్వు మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉంది.
ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదు
పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తు అని వార్తలు వస్తుంటే ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ ఆరోజే చెప్పారు
ఈరోజుకి కూడా అదే మాట మీద ఉన్నాం.. సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించుకోవద్దు…సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటున్నాడు…
ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులోని 23వ బంగ్లాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే సీఎం రమేష్ ఉంటున్నాడు.. ఆ సీసీటీవీ ఫుటేజీలు తీయిద్దామా..