ముక్త్యాల బ్రాంచ్ మేజర్ కాలువకు తక్షణమే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి…
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో ముక్త్యాల బ్రాంచ్ మేజర్ కెనాల్ ఆయకట్టు ప్రాంతానికి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ RDO కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టు ప్రాంతమైనటువంటి హుజూర్ నగర్ కు రబీ సీజన్ ప్రారంభమై సుమారుగా రెండు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కాలువ నీటిని విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. దీనివలన రైతులు కొంచెం మంది నార్లు పోయాల వద్దా అనే సందిగ్ధంలో పడిపోయి కొంచెం మంది రైతులేమో నార్లు పోసుకొని పోసుకున్నటువంటి నార్లు ఎండిపోయి చాలా నష్టపోతున్నారు అని తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సొంత నియోజకవర్గానికి నీళ్లు విడుదల చేయకపోవడం చాలా బాధాకరమని ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గెలిపించడమే వీరు చేసుకున్న పాపమా అని ప్రశ్నించారు అలాగే ఈ ప్రాంతాన్ని దాటి ఖమ్మం జిల్లాకు మాత్రం అక్కడున్నటువంటి మంత్రులు నీటిని తీసుకువెళ్లడం దేనికి సంకేతం అని విమర్శించారు. అదేవిధంగా గత వేసవి కాలం మొత్తం కూడా ఖాళీగా ఉండి ఇప్పుడు రైతులు పనులు ప్రారంభించే సమయంలో కాలువలు మరమ్మత్తుల పేరుతో సాగునీటి విడుదలను జాప్యం చేయడం తగదు అని అలాగే హడావుడిగా చేస్తున్నటువంటి కాలువ కాంక్రీట్ పనులు కూడా చాలా నాసిరికంగా ఉన్నాయని, తక్షణమే ఆ పనులను ఆపివేయాలని, నాసిరకమైన పనులు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్న కాంట్రాక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీవో గారు మరియు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఈ విషయాన్ని కలుగజేసుకొని తక్షణమే కాంక్రీట్ పనులను ఆపి రైతులకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, ఉపాధ్యక్షుడు విజయ్, గుండా నాగరాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.